ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం కీలకం | - | Sakshi
Sakshi News home page

ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం కీలకం

Mar 11 2026 7:29 AM | Updated on Mar 11 2026 7:29 AM

జనగామ రూరల్‌: ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం కీలకమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. మంగళవారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెనన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నిౖకైన సర్పంచులు, కౌన్సిలర్లకు పాలనపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగేందుకు 99 రోజుల ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. ఇందులో భాగంగానే ఈనెల 12వ తేదీన ప్రజాప్రతినిధులకు నిర్వహించే శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ..ఈనెల 12న ప్రజాప్రతినిధులకు శిక్షణ కార్యక్రమంలో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా పది థీమ్‌లను వివరించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ బెన్‌ షాలోమ్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ప్రగతి ప్రణాళికపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సమీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement