యాసంగి సీజన్‌లో బోరుబావి కింద మూడున్నర ఎకరాల్లో వరి పంట సాగు చేశా. వేసవిలో ఎండలు పెరగక ముందే బోరుబావిలో నీటిమట్టం తగ్గుముఖం పట్టింది. బోర్ నుంచి కొద్దిపాటి నీరు మాత్రమే వస్తోంది. నెలరోజుల పాటు పంటకు నీరు అందించాల్సి ఉంది. ఇప్పుడే ఈ పరిస్థితి ఇలా ఉంటే, పంట చేతి కందే వరకు కష్టంగా మారనుంది. కొద్దిరోజుల నుంచి దేవాదుల కాలువల నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఇంకా పనులు మొదటి దశలోనే ఉన్నాయి. వీటి ద్వారా పంటలకు సాగునీరు వచ్చే పరిస్థితి లేదు.
–భూక్య బాలాజీ నాయక్, రైతు, టీబీ తండా, జఫర్‌గఢ్


