మెరుగైన వైద్యసేవలు అందించాలి | - | Sakshi
Sakshi News home page

మెరుగైన వైద్యసేవలు అందించాలి

Mar 9 2026 7:30 AM | Updated on Mar 9 2026 7:30 AM

కస్తూర్బా పాఠశాలలో ఆకస్మిక తనిఖీ

స్టేషన్‌ఘన్‌పూర్‌: ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేలా వైద్యులు, వైద్య సిబ్బంది బాధ్యతగా, అంకితభావంతో పనిచేయాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝూ అన్నారు. డివిజన్‌ కేంద్రమైన స్టేషన్‌ఘన్‌పూర్‌లో కలెక్టర్‌ ఆదివారం ఆకస్మికంగా విస్తృత పర్యటన చేశారు. ముందుగా స్థానిక సీహెచ్‌సీ(కమ్యూనిటీ హెల్త్‌ హెంటర్‌)ను సందర్శించారు. ఆసుపత్రి పరిసరాలు, టాయిలెట్స్‌, వార్డుల నిర్వహణ, రోగులకు అందించే మందులను పరిశీలించారు. అనంతరం వార్డులలో వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగులతో స్వయంగా మాట్లాడారు.. వైద్యులు, వైద్యసిబ్బంది సమయానికి వస్తున్నారా.. అందుబాటులో ఉంటున్నారా.. వైద్య సేవలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. వైద్య అధికారులతో మాట్లాడుతూ ఆసుపత్రిలో ఎక్స్‌రే సేవలను వెంటనే తీసుకురావాలని, డయాలసిస్‌ సేవలను వారం రోజుల్లో అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అనంతరం నిర్మాణంలో ఉన్న వంద పడకల ఆసుపత్రిని పరిశీలించారు.

మున్సిపల్‌ కార్యాలయ సందర్శన

స్టేషన్‌ఘన్‌పూర్‌ మున్సిపల్‌ కార్యాలయాన్ని కలెక్టర్‌ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయ పరిసరాలను పరిశీలించారు. అనంతరం నూతనంగా ఎన్నికై న మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, కౌన్సిలర్లు కలెక్టర్‌ను కలువగా వారిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ నరేందర్‌, సీహెచ్‌సీ వైద్యులు సంధ్య, ప్రదీప్‌కుమార్‌ పాల్గొన్నారు.

రఘునాథపల్లి: విద్యార్థులకు పోషకాలతో కూడిన నాణ్యమైన ఆహారాన్ని అందించాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఆదేశించారు. ఆదివారం మండలంలోని ఖిలాషాపూర్‌ కస్తూ ర్బా పాఠశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందించే ఆహారాన్ని పరిశీలించారు. వంటశాలను సందర్శించి భోజనం తయారీ విధానం, నాణ్యత, పరిశుభ్రత వంటి అంశాలను పర్యవేక్షించారు. ఆహారాన్ని తనిఖీ చేసి మెనూ ప్రకారం అందిస్తున్నారా ..? అని ఆరా తీశారు. జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు శ్రీలత పాల్గొన్నారు.

సీహెచ్‌సీ వైద్యులతో కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝూ

స్టేషన్‌ఘన్‌పూర్‌లో విస్తృత పర్యటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement