పంచాయతీల అభివృద్ధికి చర్యలు | - | Sakshi
Sakshi News home page

పంచాయతీల అభివృద్ధికి చర్యలు

Mar 12 2026 7:37 AM | Updated on Mar 12 2026 7:37 AM

పంచాయతీల అభివృద్ధికి చర్యలు కొమ్మాల జాతర ఆదాయం రూ. 21.44 లక్షలు

నర్మెట/బచ్చన్నపేట: గ్రామ పంచాయతీల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వ పంచాయతీరాజ్‌ సీనియర్‌ కన్సల్‌టెంట్‌ సంత్‌దీప్‌ సింగ్‌ అన్నారు. ఉత్తమ పంచాయతీల ఎంపికలో భాగంగా బచ్చన్నపేట మండలంతోపా టు, నర్మెట మండలంలోని కన్నెబోయినగూడెం జీపీ కార్యాలయం, మండల పరిషత్‌ కా ర్యాలయాన్ని బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ కార్యాలయంలో 20 23–24 రికార్డులు, అభివృద్ధి పనులను పరిశీ లించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఎస్‌పీఎం ఇ–పంచాయతీ సీపీఆర్‌ రాజయ్య, జెడ్పీ సూపరింటెండెంట్‌ ఉ మామహేశ్వరి, ఇన్‌చార్జ్‌ ఎంపీడీఓ వెంకట మ ల్లికార్జున్‌, సర్పంచ్‌ రమేష్‌, ఉప సర్పంచ్‌ మ ధు, కార్యదర్శి విద్యాసాగర్‌, ఆర్‌ఐ సింగారపు సాయిబాబా, తదితరులు ఉన్నారు.

ఎలుగుబంటి సంచారం!

రఘునాథపల్లి: మండలంలోని కంచనపల్లి శివారులో కొన్ని రోజులుగా ఎలుగుబంటి సంచారంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. మొక్కజొన్న, వేరుశనగ పంటలను వన్యప్రాణుల నుంచి రక్షించుకోవడానికి రాత్రి సమయంలో పంట పొలాల వద్దకు వెళ్తున్నారు. బుధవారం తెల్లవారు జామున మొక్కజొన్న చేనులో ఎలుగుబంటిని గుర్తించిన రైతులు బెంబేలెత్తిపోయారు. అటవీశాఖ అధికారులు స్పందించి ఎలుగుబంటిని పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలేయాలని రైతులు కోరుతున్నారు.

వినియోగదారుల ఆందోళన

జనగామ రూరల్‌: పెట్రోల్‌కు బదులు బంక్‌లో నీళ్లు వచ్చాయని ఆరోపిస్తూ వినియోగదారులు ఆందోళనకు దిగిన ఘటన బుధవారం రాత్రి పట్టణంలోని ఆర్టీసీ పెట్రోల్‌ బంక్‌ వద్ద చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. జిల్లాకేంద్రంలోని కాంప్లెక్స్‌లో నడుస్తున్న పెట్రోల్‌ బంక్‌లో వినియోగదారుడు లక్కాకుల ప్రసాద్‌ తన ద్విచక్ర వాహనంలో పెట్రోల్‌ పోయించుకుని సుమారుగా 200 మీటర్లు వెళ్లే సరికి బైక్‌ ఆగిపోయింది. దీంతో మెకానిక్‌ వద్దకు వెళ్తే అసలు విషయం బయటపడింది. పెట్రోల్‌ తీసి చూసేసరికి వాటర్‌ లాంటి పదార్థం బయటకు రావడంతో అవాక్కయ్యారు. ఈ విషయమై సంబంధిత అధికారులకు సమాచారం అందించగా వారు వచ్చి నిర్ధారణ కోసం పరీక్షలకు పంపినట్లు తెలిపారు.

గీసుకొండ: మండలంలోని కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు, జాతర సందర్భంగా పలు రకాల సేవల ద్వారా రూ.21,44,433 ఆదాయం లభించిందని ఆలయ ఈఓ ప్రసాద్‌, ఉత్సవ కమిటీ చైర్మన్‌ వీరాటి రవీందర్‌రెడ్డి, వంశపారంపర్య ధర్మకర్త చక్రవర్తులు శ్రీనివాసాచార్యులు తెలిపారు. బుధవారం హుండీల లెక్కింపు చేపట్టగా గతనెల 27 నుంచి ఈనెల 11 వరకు వివిధ సేవల ద్వారా ఆదాయం సమకూరిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement