పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌

Mar 9 2026 7:30 AM | Updated on Mar 9 2026 7:30 AM

ఇటీవల నమోదైన విద్యుత్‌ వినియోగ

గణాంకాలు ఇలా ఉన్నాయి. (ఫిబ్రవరి,మార్చి)

డిమాండ్‌కు తగ్గట్టుగా ఏర్పాట్లు

జనగామ: జిల్లాలో గత కొన్ని రోజులుగా విద్యుత్‌ వినియోగం రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. జిల్లాకు కేటాయించిన విద్యుత్‌ కోటా 6.66 మిలియన్‌ యూనిట్లు (ఎంయూ) కాగా, ఈ నెల 1వ తేదీ నుంచి వినియోగం 5.67 ఎంయూ నుంచి 6.50 ఎంయూ వరకు పెరిగినట్లు విద్యుత్‌ శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో విద్యుత్‌ డిమాండ్‌ కూడా రికార్డు స్థాయికి చేరుకుంది. ఈ నెల 6వ తేదీన అత్యధికంగా రికార్డు స్థాయిలో 414.59 మెగావాట్ల (ఎండబ్ల్యూ) డిమాండ్‌ నమోదైందని అధికారులు వెల్లడించారు. ఇది ఇప్పటివరకు నమోదైన అత్యధిక డిమాండ్‌గా గుర్తించబడింది. అయితే పెరుగుతున్న వినియోగం ఉన్నప్పటికీ జిల్లాలో ఎలాంటి అంతరాయాలు లేకుండా విద్యుత్‌ సరఫరా కొనసాగిస్తున్నామని విద్యుత్‌ శాఖ అధికారులు తెలిపారు. ప్రత్యామ్నాయ లైన్లు ఏర్పాటు చేయడం, కొత్త సబ్‌స్టేషన్లు నిర్మించడం, ఫీడర్ల విభజన చేయడం, పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచడం వంటి చర్యలతో నిరంతర విద్యుత్‌ సరఫరా అ ందించగలుగుతున్నామని పేర్కొన్నారు. వాతావరణంలో మార్పులు రావడంతో విద్యుత్‌ వినియోగం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యుత్‌ శాఖ సిబ్బంది అప్రమత్తంగా పనిచేస్తున్నారని చెప్పారు. వినియోగదారులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా 1912 టోల్‌ ఫ్రీ నెంబర్‌కు లేదా స్థానిక ఏఈలను సంప్రదించాలని అధికారులు సూచించారు.

తేదీ వినియోగం డిమాండ్‌

(ఎంయూ) (ఎండబ్ల్యూ)

28 5.70 373.47

01 5.67 366.34

02 5.82 374.63

03 5.96 379.50

04 6.03 384.17

05 6.08 390.74

06 6.36 414.59

07 6.50 395.11

రికార్డు స్థాయిలో వినియోగం

6వ తేదీన 414.59 మెగావాట్లకు చేరిక

ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో నిరంతర విద్యుత్‌

ఇటీవల ఉష్ణోగ్రతలు పెరగడం, గృహ వినియోగం అధికమవడం, వ్యవసాయ అవసరాలు పెరగడం వంటి కారణాల వల్ల విద్యుత్‌ వినియోగం రోజురోజుకూ పెరుగుతోందని అధికారులు తెలిపారు. పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఫీడర్లు, సబ్‌స్టేషన్లు, ట్రానన్స్‌ఫార్మర్లు నిరంతరం పర్యవేక్షిస్తూ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అవసరమైనప్పుడు లోడ్‌ మేనేజ్‌మెంట్‌ చర్యలు కూడా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ నెల 6వ తేదీన రికార్డు స్థాయిలో విద్యుత్‌ వినియోగం జరిగింది.

– సంపత్‌రెడ్డి, ఎస్‌ఈ, ఎన్పీడీసీఎల్‌, జనగామ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement