జనగామ రూరల్: వినియోగదారులు తమకు రాజ్యాంగం కల్పించిన హక్కులు తెలుసుకోవాలని సాధిక్ ఫౌండేషన్ చైర్మన్, హైకోర్టు అడ్వకేట్ సాధిక్ అలీ అన్నారు. ఆదివారం ప్రపంచ వినియోగ దా రుల దినోత్సవం సదర్భంగా పట్టణంలోని స్కాలర్ గ్రామర్ స్కూల్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనగామలో వినియోగదారుల ఉద్యమం 1986లో మొదలై నేటి వరకు కొనసాగుతున్నదని తెలిపారు. వినియోగదారులకు ఏవైనా సమస్యలుంటే కలెక్టర్ కార్యాలయంలో వినియోగదారుల సమాచార కేంద్రంలో ఫిర్యాదు చేయవచ్చని, ప్రతీరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఉంటుందన్నారు. కళాకారుల ఐక్య వేదిక అధ్యక్షుడు జి.కృష్ణ,పెట్లోజు సోమేశ్వరాచారి, అయిలా సోమ నరసింహచారి, రామచంద్రం, పొట్టబత్తిని భాస్కర్, బుదారపు లావణ్య తదితరులు పాల్గొన్నారు.


