గురువారం శ్రీ 12 శ్రీ మార్చి శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

గురువారం శ్రీ 12 శ్రీ మార్చి శ్రీ 2026

Mar 12 2026 7:37 AM | Updated on Mar 12 2026 7:37 AM

న్యూస్‌రీల్‌

జనగామ రూరల్‌: జిల్లాలోని స్వయం సహాయక సంఘాల్లోని సభ్యుల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ రుణాలు అందిస్తుంది. మహిళలు స్వయం ఉపాధితో ఎదిగేలా అండగా నిలుస్తోంది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో 8,609 స్వయం సహాయక సంఘాలకు రూ.46,034 కోట్ల రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో ఇప్పటికే రూ.42,163 కోట్ల రుణాలు మహిళా గ్రూపులకు అందించారు. కాగా ఈ ఆర్థిక సంవత్సరం మరో 19 రోజులు మిగిలి ఉండగా రూ.30 కోట్ల వరకు రుణాలు ఆయా సంఘాలకు అందించాల్సి ఉంది. సగటున రోజూ కోటిన్నర చొప్పున రుణాలు అందజేస్తే లక్ష్యం చేరుకుంటారు. 91.59 శాతం పూర్తి చేయగా వందశాతం లక్ష్యం సాధించే విధంగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు.

మొదటి స్థానంలో నర్మెట

జిల్లాలోని 12 మండలాల్లో రెండు మండలాలు వందశాతం లక్ష్యం పూర్తి కాగా లక్ష్యానికి మించి రుణాలు ఇవ్వగా, మిగతా 8 మండలాల్లో లక్ష్యాన్ని చేరుకునేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. అత్యల్పంగా దేవరుప్పుల మండలం 44.38 శాతం, జఫర్‌గఢ్‌ 44.91 శాతం, కొడకండ్ల 56.03 శాతంతో రుణ మంజూరులో వెనుకబడి ఉన్నాయి. మొదటి స్థానంలో నర్మెట మండలం 112.61 శాతం, బచ్చన్నపేట మండలం 103శాతం రుణాలు మంజూరు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం మరో 19 రోజుల్లో గడువు ముగియనుంది. లక్ష్యాన్ని సాధించే దిశగా ఆయా మండలాల సెర్ప్‌ సిబ్బంది నానా తంటాలు పడుతున్నారు. బ్యాంకులను సంప్రదిస్తూ మిగతా సంఘాలకు రుణాలు మంజూరు చేసేలా ప్రయత్నిస్తున్నారు. ఎలాగైనా వందశాతం లక్ష్యాన్ని సాధించాలని వెనుకబడిన మండలాలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపి లక్ష్యం చేరుకోనేలా కృషి చేస్తున్నారు.

మొత్తం ఎస్‌హెచ్‌జీలు, లక్ష్యం, అందించిన రుణాలు

రూ. 46,034.43 కోట్లు

రూ. 42,163.06 కోట్లు

8,069

ఎస్‌హెచ్‌జీలు

అందించిన

రుణాలు

లక్ష్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement