ఎరువులు సకాలంలో అందించండి | - | Sakshi
Sakshi News home page

ఎరువులు సకాలంలో అందించండి

Mar 8 2026 7:51 AM | Updated on Mar 8 2026 7:51 AM

జనగామ రూరల్‌: రైతులకు విత్తనాలు, ఎరువులు సకాలంలో, సులభంగా అందుబాటులో ఉండేలా ప్రతీ క్లస్టర్‌లో స్వయం సహాయక సంఘాల ద్వారా ఎరువుల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అధికారులను ఆదేశించారు. ఫర్టిలైజర్‌ షాప్‌ నిర్వహణపై శనివారం కలెక్టరెట్‌లో కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఇందులో డీఏఓ అంబికా సోనీ, వ్యవసాయ ప్రాజెక్ట్‌ మేనేజర్లు కమ్యూనిటీ కో–ఆర్డినేటర్లు పాల్గొన్నారు.

విద్యార్థుల భవిష్యత్‌కు పునాది..

విద్యార్థినులు లక్ష్యాన్ని ఎంచుకుని, అందుకు అనుగుణంగా ఉన్నతంగా ఎదగాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా పేర్కొన్నారు. శనివారం మండలంలోని చౌడారం కేజీబీవీ పాఠశాలను కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో వసతి, భోజన ఏర్పాట్లు, పరిశుభ్రత వంటి అంశాలను పర్యవేక్షించారు. అనంతరం గ్రామ పంచాయతీలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు పరిశీలించారు. కార్యక్రమంలో హౌసింగ్‌ పీడీ మాతృనాయక్‌ అధికారులు ఉన్నారు.

సమర్థవంతంగా నిర్వహించాలి

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వివిధ శాఖల అధికారులు వారి పరిధిలోని కార్యక్రమాలను పక్కా యాక్షన్‌ ప్లాన్‌తో క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అన్నారు. 99 రోజుల కార్యక్రమాల అమలుపై అధికారులతో శనివారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. అదనపు కలెక్టర్‌ బెన్‌ షాలోమ్‌, డీసీపీ రాజమహేంద్ర నాయక్‌, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు

పనుల పరిశీలన

లింగాలఘణపురం: మండలంలోని నెల్లుట్ల పెద్ద చెరువు సమీపంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెత్తాచెదారం, ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగించే పనులను కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా శనివారం పరిశీలించారు. కలెక్టర్‌ వెంట మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్లు, సిబ్బంది తదితరులు ఉన్నారు.

రైతులకు ఇబ్బందులు తలెత్తొద్దు..

కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా

అధికారులతో సమీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement