తన లైఫ్‌లో చిరంజీవి సినిమాలో నటించే అవకాశం రావడం నా అదృష్టమని టాలీవుడ్ హర్షవర్ధన్ అన్నారు. మనశంకర వరప్రసాద్‌దగారు సూపర్ హిట్ కావడం సంతోషంగా ఉందన్నారు. ఇది నా లైఫ్‌లో బెస్ట్ మూమెంట్ అని తెలిపారు. తనకు మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చిందని హర్షవర్ధన్ సంతోషం వ్యక్తం చేశారు.
అయితే ఈ సినిమాకు నా వల్ల నష్టం జరగకూడదని నిర్ణయించుకున్నాని హర్షవర్ధన్ తెలిపారు. తన కాలికి గాయం కావడంతో రెండు నెలలకు పైగా టైమ్ పడుతుందని అన్నారు. దీంతో చిరంజీవి సినిమా మిస్ అవుతానని చాలా బాధపడ్డానని తెలిపారు. అందుకే నా వల్ల మూవీ ఆలస్యం కాకూడదనే.. నా బదులు ఎవరినైనా తీసుకోండని అనిల్‌తో చెప్పానని హర్షవర్ధన్ వెల్లడించారు.
కానీ అనిల్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు.. మీరు అవన్నీ మాట్లాడొద్దు..అంతా నేను చూసుకుంటానని అన్నారు. మీరు కేవలం నడవకూడదు అంతేకదా.. డైలాగ్స్, యాక్టింగ్ చేస్తే చాలని నాకు ధైర్యం చెప్పారు. అనిల్‌కు నా పట్ల మంచి అభిప్రాయం ఉంది..నారాయణ క్యారెక్టర్‌కు నువ్వు తప్ప ఎవరినీ పెట్టే ప్రసక్తే లేదని అనిల్ రావిపూడి చెప్పారని హర్షవర్ధన్ పంచుకున్నారు. నా వల్ల సినిమా ఆలస్యమైతే ఎక్కడా తీరని మచ్చలా ఉండిపోతుందేమో భయపడ్డానని తెలిపారు.
నా వల్ల #chiranjeevi గారి సినిమాకి భారీ నష్టం..
నా జీవితంలో అది తీరని మచ్చలా ఉండిపోతుంది
- Actor #HarshaVardhan Exclusive Interview https://t.co/Fhr5TvdjTw#ManaShankaraVaraPrasadGarutrailer #anilravipudi pic.twitter.com/I8FPpPgBiW— TeluguOne (@Theteluguone) January 22, 2026


