లేటు వయసులో డేటింగ్‌.. పొరపాటున జరిగిపోయింది: అమిర్ ఖాన్‌ | Aamir Khan recently spoke about his relationship with Gauri Spratt | Sakshi
Sakshi News home page

Aamir Khan: 'గౌరీతో ప్రేమ.. పొరపాటున కలుసుకున్నాం'

Jun 2 2025 7:09 AM | Updated on Jun 2 2025 9:21 AM

Aamir Khan recently spoke about his relationship with Gauri Spratt

బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ సినిమాల కంటే వ్యక్తిగతంగానే వార్తల్లో నిలుస్తున్నారు. ఆరు పదుల వయస్సులో ప్రేమ అంటూ అభిమానులకు పెద్ద షాకే ఇచ్చాడు. బెంగళూరుకు చెందిన గౌరీ స్ప్రాట్‌తో డేటింగ్‌ ఉన్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌తో పాటు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. తన బర్త్‌ డే వేడుకల సందర్భంగా ఈ విషయాన్ని పంచుకున్నారు.

అయితే తాజా ఇంటర్వ్యూలో గౌరీ స్ప్రాట్‌తో తన  రిలేషన్ గురించి మాట్లాడారు. ఈ వయలులో మళ్లీ ప్రేమలో పడాలనే ఆలోచన తనకు లేదని అన్నారు. ఇప్పటికే తన వయసు అయిపోయిందని.. తనకు భాగస్వామి దొరకడం సాధ్యం కాదని  భావించేవాడినని ఆమిర్ పేర్కొన్నారు. తనకు వృద్ధాప్యఛాయలు వచ్చినట్లు అనిపించిందని.. గౌరీని కలవడానికి ముందు థెరపీ చేయించుకున్నానని తెలిపారు. నేను, గౌరీ పొరపాటున కలుసుకున్నామని అమిర్‌ ఖాన్ వెల్లడించారు.

గౌరీతో పరిచయాన్ని గుర్తుచేసుకుంటూ.. 'నేను, గౌరీ పొరపాటున కలుసుకున్నాం. ఆ తర్వాత మేము స్నేహితులమయ్యాం.. మా మధ్య ప్రేమ పుట్టింది. నాకు నా తల్లి, పిల్లలు, తోబుట్టువులు ఉన్నారు. నాకు ఇప్పటికే చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, నాకు భాగస్వామి అవసరం లేదు. కిరణ్, రీనా నేను ఇప్పటికీ పానీ ఫౌండేషన్ కోసం కలిసి పని చేస్తున్నాం. మేము ప్రతిరోజూ కూర్చుని మాట్లాడుకుంటాం.  ఒక కుటుంబంగా మా మధ్య నిజమైన ప్రేమ ఉంటుంది మేము ఎల్లప్పుడూ కుటుంబంగానే ఉంటాం. మేము భార్యాభర్తలం కాకపోవచ్చు.. కానీ మేము ఎల్లప్పుడూ ఓకే ఫ్యామిలీగానే ఉంటాం. వారు ఎప్పటికీ నా జీవితంలో ఒక శాశ్వత భాగం.' అని వెల్లడించారు. కాగా..అమిర్ ఖాన్‌,  గౌరీ ఏప్రిల్ 12న చైనాలో జరిగిన మకావు ఇంటర్నేషనల్ కామెడీ ఫెస్టివల్‌లో జంటగా మొదటిసారి కనిపించారు. ప్రస్తుతం అమిర్‌ ఖాన్‌ 'సితారే జమీన్ పర్', లోకేష్ కనగరాజ్ 'కూలీ'చిత్రంలో కనిపించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement