
బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ ఈ ఏడాది అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. తన బర్త్ డే రోజున ప్రియురాలిని ఫ్యాన్స్కు పరిచయం చేశారు. బెంగళూరుకు చెందిన గౌరీ స్ప్రాట్‌తో డేటింగ్ ఉన్నానని ప్రకటించి అందరికీ షాకిచ్చారు. ఆరు పదుల వయస్సులో లవ్లో పడ్డానంటూ రివీల్ చేశారు. ఆ తర్వాత వీరిద్దరు పలు ఈవెంట్లలో జంటగా కనిపించారు.
ఇదిలా ఉంచితే తాజాగా అమిర్ ఖాన్ ప్రియురాలు గౌరీ స్ప్రాట్ తాజాగా ముంబయిలోని బాంద్రాలో కనిపించింది. రోడ్డుపై నడుచకుంటూ వెళ్తున్న ఆమెను కొందరు ఫోటోగ్రాఫర్స్ వెంటపడ్డారు. దీంతో అసహనానికి గురైన గౌరీ.. దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి.. నేను వాకింగ్కు వెళ్తున్న అంటూ తన ఫోటోలు తీస్తున్న వారిపై మండిపడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వాకింగ్ చేసేందుకు వెళ్తున్న ఆమెను వెంటపడమేంటని నెటిజన్స్ సైతం తప్పు పడుతున్నారు. సెలబ్రిటీలను ఇలా రోడ్లపై వేధించడం సరికాదని హితవు పలుకుతున్నారు.
ఇక అమిర్ ఖాన్ విషయానికొస్తే ఈ ఏడాది 'సితారే జమీన్ పర్' చిత్రంలో బాస్కెట్‌బాల్ కోచ్‌గా నటించి మెప్పించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అంతేకాకుండా ఇటీవల విడుదలైన రజినీకాంత్ కూలీ చిత్రంలో కీలక పాత్రలో నటించారు.