breaking news
wedding ring
-
256 గంటలు, 131 మంది శ్రమ : ఆమీర్-గౌరీ అరుదైన వెడ్డింగ్ రింగ్
బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ జూలై 5న తన బాంద్రా నివాసంలో గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకున్నారు. అయితే అప్పటినుంచి ఈ వేడుకకు సంబంధించిన విశేషాలు నెట్టింట హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాయి. ఆమీర్ మొదటి, రెండో భార్య, పిల్లలు,ఇతర కుటుంబ సభ్యులతో పాటు,కొద్దిమంది స్నేహితుల సమక్షంలో ఆమీర్-గౌరి వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. ఈ ఈవెంట్లో ఆమీర్, గౌరి మ్యాచింగ్ సాంప్రదాయ దుస్తుల్లో అందంగా మెరిసారు. అలాగే ఆమీర్ ఒక కాలికి మాత్రమే పెట్టుకున్న మువ్వలు, గౌరీ స్ప్రాట్ పాస్టెల్ రంగు లెహంగా, లేయర్డ్ నెక్లెస్‌లు పఠానీ హారం ధరించి అందర్నీ ఆకట్టుకున్నారు. చాలా అరుదైన వీరి వెడ్డింగ్ రింగ్‌పై ఆసక్తి నెలకొంది. అలాగే దీనికి సంబంధించిన విషయాలు వైరలవుతున్నాయి.కొత్త పెళ్లికూతురు గౌరీ రూబీ (కెంపు) వెడ్డింగ్ రింగ్ స్పెషల్ ఎట్రాక్షన్. దీన్ని లగ్జరీ జ్యువెలరీ బ్రాండ్ 'QWEEN' దీనిని డిజైన్ చేసింది. ఇందులో మడగాస్కర్ నుండి సేకరించిన అత్యంత అరుదైన 'సహజ క్యాబోచన్-కట్ రూబీ' (cabochon-cut ruby) ని ఉపయోగించారు. ఇది మిలియన్లో ఒకటి మాత్రమే దొరికేంత అరుదైనది. ఈ రూబీ చుట్టూ దాదాపు 40 సహజమైన వజ్రాలను (diamonds) పొదిగారు.ఈ రత్నాన్ని వెతకడానికే మూడు నెలలకు పైగా సమయం పట్టింది. 'QWEEN' సంస్థ కో-ఫౌండర్ అమిత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. 131 మంది నైపుణ్యం గల చేతి వృత్తికళాకారులు 256 గంటల కంటే ఎక్కువ సమయం సరిగ్గా చెప్పాలంటే 10 రోజుల16 గంటలు (దాదాపుగా పదిన్నర రోజులకు పైగా)శ్రమించి, ఈ రింగ్‌ను డిజైన్ చేశారు.ఇదీ చదవండి: ఆమీర్ భార్య గౌరి బ్రైడల్ లుక్ : 'పఠానీ హార్' విశేషాలు తెలుసా? ఏంటీ ప్రత్యేకత ఈ రూబీ చుట్టూ దాదాపు 40 సహజమైన వజ్రాలను (diamonds) పొదిగారు. సాధారణ రింగ్స్ లాగా కాకుండా, ఈ రూబీని ఒక క్రోన్ లాంటి నిర్మాణంలో అమర్చారు. దీని కటింగ్ కూడా 'క్యాబోచన్ కట్' (మృదువైన, గుండ్రని ముగింపు) ఇవ్వడం వల్ల ఈ రత్నం మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుంది. చారిత్రక రాజకుటుంబాల నగలను గుర్తుచేసేలా 'మిల్‌గ్రెయిన్ బీడింగ్' (milgrain beading) శైలిలో దీనిని రూపొందించారు. భవిష్యత్తు తరాలకు అందించే ఒక అపురూపమైన ఆస్తిగా ఉండేలా ఈ రింగ్‌ను తీర్చిదిద్దారు. మరోవైపు ఈ ఏడాది ఆరంభంలోనేచిరకాల ప్రియురాలు గౌరీ స్ప్రాట్ వేలికి బ్రెజిల్ దేశానికి చెందిన అరుదైన ‘ఆక్వామెరైన్’ (Aquamarine) రింగ్ ఆమీర్ ప్రత్యేకంగా చేయించి మరి ఇచ్చారట.ఇదీ చదవండి: రెడ్ బెనారసీ డ్రెస్‌లో పార్టీ లుక్.. తొలిసారి ఇలా అన్షులా! -
ఎప్పుడో హింట్ ఇచ్చిన సమంత.. ఇప్పుడు పెళ్లి జరిగేసరికి
హీరోయిన్ సమంత మరో పెళ్లి చేసుకుంది. 'ద ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ తీసిన దర్శకుల్లో ఒకరైన దర్శకుడు రాజ్ నిడిమోరుతో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. కోయంబత్తూర్‌లోని ఈశా ఫౌండేషన్‌లో ఈ శుభకార్యం జరిగింది. ఈ క్రమంలోనే నెటిజన్లు.. ఈ పెళ్లి గురించి తెగ డిస్కషన్ చేస్తున్నారు. ఇక్కడివరకు అందరికీ తెలుసు. అయితే సమంతకు చాన్నాళ్ల క్రితమే నిశ్చితార్థం జరిగిందా? ఆ మేరకు హింట్ కూడా ఇచ్చిందా? అనేది ఇప్పుడు వైరల్ అవుతోంది.రాజ్‌తో సమంత స్నేహం ఇప్పటిది కాదు. 'ద ఫ్యామిలీ మ్యాన్' షూటింగ్ చేస్తున్న టైంలోనే అంటే 2020 నుంచే వీళ్లకు పరిచయముంది. కాకపోతే నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత వీళ్ల మధ్య బాండింగ్ పెరిగినట్లుంది. మరి ఎప్పుడు ప్రేమలో పడ్డారో తెలియదు గానీ గత కొన్నాళ్ల నుంచి మాత్రం సామ్-రాజ్ ఎప్పటికప్పుడు జంటగానే కనిపిస్తూ వచ్చారు. దీంతో వీళ్ల డేటింగ్ గురించి రూమర్స్ చాలానే వచ్చాయి. అయితే ఇలా సడన్‌గా పెళ్లి చేసుకుని షాక్ ఇస్తారని మాత్రం ఎవరూ అనుకోలేదు.(ఇదీ చదవండి: రాజ్ ఎవరు? సమంతతో పరిచయం ఎలా? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?)పెళ్లి తర్వాత ఫొటోలని సమంత.. సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో ఒకదానిలో చేతికి డైమండ్ రింగ్ ఉంది. అయితే ఈ రింగ్ గతంలో సామ్ పోస్ట్ చేసిన ఓ ఫొటోలోనూ కనిపించింది. అది కూడా ఈ ఏడాది వాలంటైన్స్ డేకి ముందు రోజు. అంటే 10 నెలల క్రితమే సమంతకు నిశ్చితార్థం అయిపోయిందా? అనే సందేహం వస్తోంది. అప్పుడే చేతికి రింగ్‌తో హింట్ ఇచ్చింది కానీ అభిమానులు పసిగట్టలేకపోయారా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.సమంత.. గతంలో తెలుగు హీరో నాగచైతన్యని 2017లో పెళ్లి చేసుకుంది. కాకపోతే మనస్పర్థల కారణంగా 2021లో విడాకులు తీసుకున్నారు. మరోవైపు రాజ్ నిడిమోరు కూడా శ్యామోలి అనే మహిళని 2015లో పెళ్లి చేసుకున్నాడు. 2022లో వీళ్లు విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. అలా సామ్, రాజ్.. ఇద్దరికీ ఇది రెండో పెళ్లినే కావడం విశేషం.(ఇదీ చదవండి:'భూత శుద్ది వివాహం' చేసుకున్న సమంత.. అసలేంటిది?) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
విచిత్రం: పోయిందనుకున్న బంగారు ఉంగరం దొరికింది!
వాషింగ్టన్: ప్రతి ఒక్కరు తమ జీవితంలో కొన్నివస్తువులను చాలా అపురూపంగా చూసుకుంటారు. కానీ పొరపాటున ఆ వస్తువును ఎక్కడైనా కోల్పోతే.. ఇంకేమైనా ఉందా? ఎవరు ఓదార్చినా ఆ బాధ తగ్గేది కాదు. కానీ అదే వస్తువు మళ్లీ కళ్లముందు ప్రత్యక్షమైతే.. ఆ ఆనందానికి అవధులు ఉండవు. ఇలాంటి సంఘటనే అమెరికాలో చోటుచేసుకుంది. పాపిని అనే వ్యక్తి సరదాగా కాలిఫోర్నియాలోని నదిలో ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలో అతని వేలికున్న వెడ్డింగ్ రింగ్ జారిపోయి నీటిలో పడిపోయింది. పాపం.. దానికోసం ఎంతో వెతికాడు. కానీ ఆ ఉంగరం దొరకలేదు. దీంతో చాలా దిగులు పడ్డాడు. కానీ, ఆ ఉంగరం ఎప్పటికైనా తనకు దొరుకుతే బాగుండని ఆశపడేవాడు. విడ్డూరంగా అతను మనసులో పెట్టుకున్న నమ్మకమే నిజమైంది. డైపర్ కర్ల్ బ్లే అనే వ్యక్తి అదే నదిలో ఈదుతున్నప్పుడు అతనికి ఒక బంగారు ఉంగరం దొరికింది. దీన్ని అతడు సోషల్ మీడియా వేదికగా పోస్ట్చేశాడు. ఈ పోస్ట్ చూసిన పాపిని తెగ సంబరపడిపోయి.. వెంటనే కర్ల్ బ్లేను కలిశాడు. ఆ ఉంగరం తన పెళ్లినాటిదని, దాన్ని ఆ నదిలో పోగొట్టుకున్నానని అతడితో చెప్పాడు. ఉంగరాన్ని దొరికిన విషయాన్ని సోషల్ మీడియాలో పంచున్నందుకు కర్ల్ బ్లేకు ధన్యవాదాలు తెలిపాడు. పొగొట్టుకున్న తన ఉంగరం దొరకడంతో పాపిని ఇప్పటికీ తన కళ్లను తాను నమ్మలేకపోతున్నాడు. కాగా, కర్ల్ బ్లేకి చిన్నప్పటి నుంచి ఈత కొట్టడం అలవాటు. ఈ క్రమంలో నీటిలో ఏదైనా వస్తువు దొరికితే వాటిని సోషల్ మీడియాలో పంచుకొని దాని నిజమైన యజమానికి అవి చేరేలా చూస్తూ ఉంటాడు. -
అంతెత్తున పేరుకున్న చెత్త, అయినా వెడ్డింగ్ రింగ్ కోసం..
లండన్: వివాహ బంధంలో వెడ్డింగ్ రింగ్‌కు చాలా ప్రాధాన్యం ఉంటుంది. అవి భార్యభర్తల మధ్య ప్రేమకు ప్రాతినిథ్యం వహిస్తాయి. అయితే ఓ వ్యక్తి సరిగ్గా ప్రేమికుల రోజునే తన వెడ్డింగ్ రింగ్ పొగొట్టుకున్నాడు. భార్యకు ఏం చెప్పాలో.. రింగ్ ఎక్కడ పోయిందోనని తెగ గాబరాపడ్డాడు. చివరకు మున్సిపల్ సిబ్బంది చొరవడంతో ఉంగరాన్ని వెతికి పట్టుకుని ఊపిరి పీల్చుకున్నాడు. ఈ సంఘటన బ్రిటన్‌లో జరిగింది. వివరాలు.. బ్రిటన్‌కు చెందిన జేమ్స్ రాస్కు 2009లో లారాతో వివాహామైంది. ప్రస్తుతం వీరికి ఇద్దరు కూతుళ్లు. పెళ్లై ఇన్నేళ్లవుతున్న రాస్ ఈ తన పెళ్లి ఉంగరాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకున్నాడు. ఎప్పుడూ దానిని చేతి వేలికి ధరించే ఉంటాడట. ఈ క్రమంలో ప్రేమికుల రోజున ఉదయాన్నే మున్సిపాలిటీ వాహనం రాగానే ఇంట్లోని చెత్తను అందులో పడేశాడు. తిరిగి ఇంట్లోకి వెళ్లి తన పనుల్లో మునిగిపోయాడు. అయితే, కాసేపయ్యాకు చూసుకుంటే వేలికి ఉండే ఉంగరం మాయమైంది. అది చూసి రాస్ షాకయ్యాడు. ఏమైందో తెలియక తెగ కంగారు పడ్డాడు. తను ఏమేం పనులు చేశాడో గుర్తు చేసుకున్నాడు. చెత్త వేసి వచ్చాకే ఉంగరం మిస్సయిందన్న విషయం తెలుసుకుని వెంటనే పరుగెత్తుకెళ్లాడు. అయితే అప్పటికే మున్సిపాలిటీ వాహనం ఆ కాలనీ నుంచి వెళ్లిపోయింది. దీంతో అక్కడే ఉన్న మహిళా పోలీసు అధికారినికి తన గోడు చెప్పుకున్నాడు. ఆమె స్పందించి ఆ వాహనాన్ని వెంబడించింది. మున్సిపాలిటీ సిబ్బందికి జరిగిన విషయం చెప్పి ఉంగరం వెతకమని నలుగురు మున్సిపాలిటీ సిబ్బందిని కోరింది. దీంతో వారు వాహనంలో ఉంగరం వెతకడం ప్రారంభించారు. అంతెత్తున పేరుకున్న చెత్తలో దాదాపు 20 నిమిషాలు వెతికి ఉంగరాన్ని కనిపెట్టి రాస్కు ఇచ్చారు. దీంతో అతడు ప్రాణం లేచివచ్చినంతగా ఆనందపడ్డాడు. మళ్లీ తన ఉంగరం దొరుకుతుందని అనుకోలేదంటూ హర్షం వ్యక్తం చేశాడు. ఇక ఈ విషయాన్ని బ్రిటిన్ మున్సిపాలిటీ అధికారులు ఫేస్బుక్లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. దీంతో సదరు సిబ్బందిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అలాగే దీనిపై రాస్ స్పందిస్తూ.. ‘అసలు రింగ్ దొరుకుతుందని అనుకోలేదు. వాలెంటైన్స్ డే నాడే వెడ్డింగ్ రింగ్ పోయిందన్న విషయం నా భార్యకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు. నా ప్రాణం పోయినంత పనైంది’ అంటూ అతడు పోస్టు చేశాడు. అయితే ఈ ఉంగరం అతడికి ఎందుకంత ప్రత్యేకమో కూడా వివరించాడు. ఆ ఉంగరంపై తన భార్య రాసిన అక్షరాలు ఉన్నాయని, అవి లేజర్ ద్వారా సెట్ చేసినట్లు చెప్పాడు. అందుకే ఈ ఉంగరం తనకు చాలా ప్రత్యేకమని రాస్ చెప్పాడు. -
దీపిక వెడ్డింగ్ రింగ్ ఖరీదు ఎంతంటే..
సాక్షి, ముంబై : వివాహ బంధంతో ఒక్కటైన బాలీవుడ్ హాట్ కపుల్ దీపికా పడుకోన్, రణ్వీర్ సింగ్‌లకు బాలీవుడ్ సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.ఇటలీలో అత్యంత ఆర్భాటంగా జరిగిన వివాహ వేడుక బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. పెళ్లిలో దీపిక ధరించిన ఓ రింగ్ ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. భారీ డైమండ్ పొదిగిన ఈ ఉంగరం వెడ్డింగ్ లేదా ఎంగేజ్మెంట్ రింగ్ అయి ఉంటుందని భావిస్తున్నారు. భారీ సైజ్‌లో ఉన్న ఈ రింగ్ ధర ఖరీదు వింటే షాక్ తినాల్సిందే. ఈ రింగ్ ధర రూ 1.3 నుంచి 2.7 కోట్లు ఉంటుందని బాలీవుడ్‌లైఫ్ పోర్టల్ పేర్కొంది. ఈ రింగ్ ధర రూ కోటిపైగానే పలుకుతుందని చెబుతున్నారు. దీపిక వేళ్లకు పలు రింగ్‌లున్నా భారీ డైమండ్‌తో రూపొందిన ఈ రింగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. దీపిక, రణ్‌వీర్‌ల పెళ్లి వేడుక నవంబర్ 14, 15 తేదీల్లో ఇటలీలో సింధ్, కొంకణ్ సంప్రదాయాల్లో జరిగిన సంగతి తెలిసిందే. ఆరేళ్లుగా వీరిమధ్య సాగిన అనుబంధం పెళ్లి పీటలకు చేరడంతో బాలీవుడ్ ప్రముఖులంతా కొత్త జంటను అభినందనల్లో ముంచెత్తారు. -
వెడ్డింగ్ రింగ్ ఖరీదెంతంటే..
టస్కనీ: ఇటలీలో అత్యంత వైభవంగా జరిగిన విరాట్ కోహ్లి, అనుష్క శర్మల వివాహం హాట్ టాపిక్‌గా మారడంతో వివాహానికి సంబంధించిన ప్రతి అంశాన్నీ ఆసక్తిగా గమనిస్తున్నారు. కన్నుల పండువగా జరిగిన విరుష్క వివాహ ఫోటోలు పలువురిని ఆకర్షిస్తుండగా, తాజాగా వారి ఎంగేజ్మెంట్ రింగ్‌పై ఆసక్తికర వార్త హల్చల్ చేస్తోంది. అనుష్కకు చక్కగా సరిపోయే వెడ్డింగ్ రింగ్ కోసం విరాట్ మూడు నెలలు అన్వేషించాడని చెబుతున్నారు. ఆస్ర్టియాకు చెందిన ప్రఖ్యాత డిజైనర్చే అరుదైన డైమండ్ రింగ్‌ను అనుష్క కోసం స్వయంగా విరాట్ చేయించాడని కోహ్లి సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ రింగ్ అత్యంత అద్భుతంగా ఉండటంతో పాటు భిన్న కోణాల్లో చూసిన ప్రతిసారి ఆశ్యర్యానికి లోను చేసే విధంగా ఉంటుందని తెలిపాయి. ఈ స్పెషల్ డైమండ్ రింగ్ ఖరీదు రూ కోటి ఉంటుందని దీని ప్రత్యేకతలకు ఆ ధర ఎక్కువేమీ కాదని చెబుతున్నారు. ఎవరైనా ఈ రింగ్‌ను చూస్తే దాన్నుంచి చూపు మరల్చుకోని విధంగా ఉంటుందని సమాచారం. రింగ్ ఖరీదు చూస్తే విరుష్క వివాహానికి వేదికైన ఇటలీలోని ప్రఖ్యాత రిసార్ట్స్ రెంట్ కన్నా ఎక్కువ కావడం గమనార్హం. ఎన్నో ఊహాగానాల నడుమ చిరకాల స్నేహితులైన విరాట్, అనుష్కల వివాహం ఇటలీలోని టస్కనీలో అత్యంత సన్నిహితుల నడుమ జరిగిన విషయం తెలిసిందే. -
ఆ ఉంగరం ఆరు కోట్లు
సౌత్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తరువాత బాలీవుడ్లో సత్తా చాటిన అసిన్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. ఇటీవల నిశ్చితార్ధం చేసుకున్న అసిన్ కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటోంది. అయితే వెండితెరకు దూరమైనా, ఏదో ఒక విధంగా వార్తల్లో కనిపిస్తూనే ఉంది. ముఖ్యంగా రాహుల్ శర్మతో ప్రేమ, తరువాత త్వరలోనే పెళ్లి అంటూ వార్తలు వినిపించటం, వెంటనే నిశ్చితార్థం ఇలా వరుసగా అసిన్ పేరు బాలీవుడ్లో మారు మోగింది. తాజాగా మరోసారి అసిన్ పెళ్లి తెర మీదకు వచ్చింది. డిసెంబర్ 27న తన పుట్టిన రోజు సందర్భంగా సల్మాన్ ఇచ్చిన పార్టీకి తనకు కాబోయే భర్తతో కలిసి హాజరైంది అసిన్. ఈ ఫంక్షన్లో అసిన్ చేతికి ఉన్న నిశ్చితార్ధపు ఉంగరం అందరి దృష్టిని ఆకర్షించింది. బాలీవుడ్ టాప్ స్టార్స్ ను కూడా ఆకర్షించేంత గొప్పదనం ఆ ఉంగరంలో ఏముంది అనుకుంటున్నారా..? అది మూములు బంగారు ఉంగరం కాదు.. భారీ వజ్రం పొదిగిన ఉంగరం. దాని విలువ కూడా 6 కోట్ల పై మాటేనట. అందుకే ప్రస్తుతం అసిన్ ఉంగరం కూడా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది.


