టాక్సిక్ వాయిదా పడే ఛాన్స్.. అంతా యశ్ వల్లేనా? | Yash's Toxic Movie Postponed Again Due To These Reasons Goes Viral | Sakshi
Sakshi News home page

Toxic Movie: టాక్సిక్ మళ్లీ వాయిదా.. అంతా యశ్ వల్లేనా?

Apr 27 2026 3:58 PM | Updated on Apr 27 2026 4:27 PM

Yash's Toxic Movie Postponed Again Due To These Reasons Goes Viral

కేజీఎఫ్ తర్వాత యశ్ నటిస్తోన్న భారీ యాక్షన్‌ చిత్రం టాక్సిక్. ఈ బిగ్ ప్రాజెక్ట్‌కు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్‌ ఓసారి వాయిదా వేశారు. మార్చిలో రావాల్సిన ఈ చిత్రం జూన్‌కు పోస్ట్‌పోన్ అయింది. ఈ మూవీ టీజర్‌ రిలీజ్ చేసిన మేకర్స్ ఒక్కసారిగా అంచనాలు పెంచేశారు. టీజర్‌లో బోల్డ్ సీన్‌ ఉండడంతో పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. అయితే ఈ మూవీ రిలీజ్‌ మరోసారి వాయిదా పడనుందనే టాక్ వినిపిస్తోంది. జూన్ 4న రిలీజ్‌ కావడం కష్టమేనని తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం మూవీ షూటింగ్‌ ఇంకా పూర్తి కాలేదు. అంతేకాకుండా ఆర్థిక లావాదేవీల విషయంలో వివాదం కూడా ఉన్నట్లు సమాచారం.

ఓటీటీ డీల్‌ ఆలస్యం..!

ఈ బిగ్‌ మూవీ ఓటీటీ డీల్‌పై వివాదం కొనసాగుతోంది. ఈ మూవీ నిర్మాతలు డిజిటల్ రైట్స్ కోసం ఏకంగా రూ.250 కోట్ల భారీ మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుత మార్కెట్ ప్రకారం ఓటీటీ యాజమాన్యాలు రూ.110 కోట్లకు పైగా చెల్లించేందుకు ముందుకు రావడం లేదు. నిర్మాతల డిమాండ్ వల్లే టాక్సిక్ మరింత ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంది.

యశ్ వల్లేనా..?

ఈ మూవీ ఓటీటీ డీల్ ఆలస్యానికి హీరో యశ్‌ ఓ కారణమని తెలుస్తోంది. సాధారణంగా పెద్ద ప్రాజెక్టులకు ఓటీటీ డీల్ సమయంలో ఆ సంస్థ ప్రతినిధులకు సినిమా ప్రివ్యూ చూపించాలి. కానీ మాత్రం ఈ విషయంలో ఒప్పుకోవడం లేదని సమాచారం. ఈ చిత్రాన్ని కేవలం థియేటర్లలోనే చూడాలని..ముందే చూపించడం వల్ల సినిమాపై ఆసక్తి తగ్గుతుందని యశ్‌ భావిస్తున్నారట. యశ్ నిర్ణయం వల్ల తీసుకున్న అంత పెద్ద మొత్తాన్ని ఇచ్చేందుకు ఓటీటీలు వెనకాడుతున్నాయని లేటేస్ట్ టాక్. అందుకే టాక్సిక్ మరోసారి వాయిదా తప్పదని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement