'యశ్‌తో ఇంటిమేట్ సీన్స్.. అదంతా నాన్‌సెన్స్' | Kiara Advani denies asking for cuts in Toxic intimate scenes | Sakshi
Sakshi News home page

Kiara Advani: 'యశ్‌తో ఇంటిమేట్ సీన్స్.. అదంతా నాన్‌సెన్స్'

May 4 2026 7:50 PM | Updated on May 4 2026 8:44 PM

Kiara Advani denies asking for cuts in Toxic intimate scenes

కేజీఎఫ్ స్టార్ యశ్ నటించిన యాక్షన్‌ మూవీ టాక్సిక్. ఈ మూవీ ఊహించని వివాదాలతో వాయిదా పడింది. జూన్ 4న రావాల్సిన ఈ సినిమా పోస్ట్‌పోన్ చేశారు. కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. ఈ మూవీకి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అ‍ద్వానీ హీరోయిన్‌గా కనిపించనుంది. అయితే తాజాగా టాక్సిక్ మూవీకి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. కియారా తన ఇంటిమేట్ సీన్స్‌ కట్ చేయాలని మేకర్స్ కోరినట్లు తెగ హల్‌చల్ చేస్తోంది.

ఈ నేపథ్యంలో హీరోయిన్ కియారా అద్వానీ దీనిపై స్పందించింది. యశ్‌తో ఇంటిమేట్ సీన్స్‌ తొలగించాలని తాను కోరలేదని తెలిపింది. ఇవన్నీ అబద్ధమని కొట్టిపారేశారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. ఇలాంటివీ ఎవరు కూడా నమ్మవద్దని హితవు సూచించారు. ఈ మూవీ ఫైనల్ కట్ చూసిన కియారా.. కొన్ని బోల్డ్ తొలగించాలని పలు కథనాలు వెలువడ్డాయి. దీంతో హీరోయిన్ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఈ చిత్రాన్ని కెవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ చిత్రంలో నయనతార, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా కీలక పాత్రల్లో నటించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement