టాక్సిక్‌ గ్యాంగ్‌స్టర్‌ సినిమా కాదు.. యశ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు | Yash Interesting Comments On Toxic Movie | Sakshi
Sakshi News home page

టాక్సిక్‌ గ్యాంగ్‌స్టర్‌ సినిమా కాదు.. యశ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Apr 15 2026 2:43 PM | Updated on Apr 15 2026 2:53 PM

Yash Interesting Comments On Toxic Movie

గీతూ మోహన్ దాస్‌ దర్శకత్వంలో యశ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం టాక్సిక్‌. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. టీజర్‌ చూసిన తర్వాత అందరూ ఇది కూడా కేజీయఫ్‌లో ఓ గ్యాంగ్‌స్టర్‌ కథ అని ఫిక్స్‌ అయ్యారు. కానీ ఇది అలాంటి కథ కానే కాదు అంటున్నాడు హీరో యశ్‌. ఇంతవరకు ఇలాంటి కథాంశంతో ఒక్క చిత్రం కూడా రాలేదని..ఇదొక డిఫరెంట్‌ జోనర్‌ మూవీ అంటున్నాడు. 

తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో టాక్సిక్‌ సినిమా గురించి మాట్లాడారు. ‘టీజర్‌ రిలీజ్‌ తర్వాత అందరూ ఇది గ్యాంగ్‌స్టర్‌ కథ అంటున్నారు. కానీ పదేపదే చెబుతున్నా.. ఇది గ్యాంగ్‌స్టర్‌ సినిమా కాదు. యాక్షన్‌ మాత్రమే కాదు బలమైన ఎమోషన్స్‌ ఉంటాయి. కొత్త కాన్సెప్ట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. సినిమాకు వచ్చిన ప్రేక్షకుడు కొత్త ప్రపంచంలోకి వెళతాడు. విజువల్స్‌ ఆకట్టుకుంటాయి. అలాగే నా నుంచి అభిమానులు కోరుకుంటున్న అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. ప్రతి చిన్న విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కచ్చితంగా ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’ అన్నారు. 

అలాగే యశ్‌ రావణుడిగా, రణ్‌బీర్‌ రాముడిగా కలిసి నటిస్తున్న ‘రామాయణ’ చిత్రం గురించి మాట్లాడుతూ.. ‘తొలిభాగంలో రణ్‌బీర్‌తో నాకు ఎలాంటి సన్నివేశాలు లేవు. కానీ ఇద్దరం పలుమార్లు కలుసుకున్నాం. రణ్‌బీర్‌ ఓ అద్భుతమైన నటుడు. మా ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉన్నాయి. అది ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది’అన్నారు. నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. ఈ ఏడాది దీపావళికి తొలి భాగం విడుదల కానుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement