టాక్సిక్ వంద రోజుల రీ షూట్.. నిర్మాణ సంస్థ క్లారిటీ | Makers Gives Clarity On Actor Yash Toxic Movie 100 Day Reshoot Rumours, Calls Reports False | Sakshi
Sakshi News home page

Toxic Movie: టాక్సిక్ రీ షూట్.. నిర్మాణ సంస్థ రియాక్షన్

Jun 9 2026 4:35 PM | Updated on Jun 9 2026 4:59 PM

Makers clarify On Yash Toxic being re shoot after postponement

కన్నడ స్టార్, కేజీఎఫ్ హీరో నటించిన యాక్షన్‌ మూవీ టాక్సిక్..ఏ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్. ఈ సినిమాకు గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు. జూన్ 4న థియేటర్లలోకి రావాల్సిన ఈ చిత్రం అనూహ్యంగా వాయిదా పడింది. దీంతో అదే తేదీన రామ్ చరణ్ పెద్ది థియేటర్లలోకి వచ్చేసింది.

అయితే తాజాగా ఈ మూవీపై కొన్ని ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలోని కొన్ని సీన్స్‌పై హీరో యశ్ తీవ్ర అసంతప్తిగా ఉన్నారని టాక్. అందుకే దాదాపు రూ.40 కోట్ల వ్యయంతో నిర్మించిన వంద రోజుల షూటింగ్‌ను రీ షూట్ చేయాలని అడిగారని ఓ వార్త వైరలవుతోంది. రిలీజ్ తేదీ వాయిదా పడడంతో ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూరుతోంది.

ఈ నేపథ్యంలోనే టాక్సిక్ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ స్పందించింది. రీ షూట్‌ అంటూ వస్తున్న వార్తలను ఖండించింది. ఈ చిత్రానికి ఎలాంటి రీషూట్‌లు షెడ్యూల్ చేయలేదని నిర్మాణ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా.. మొదట 'టాక్సిక్' మూవీని మార్చి 19న విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ కుదరలేదు.. ఆ తర్వాత జూన్ 4వ తేదీని అనౌన్స్‌ చేసినప్పటికీ మళ్లీ వాయిదా వేశారు. ఇప్పటి వరకు చిత్ర నిర్మాతలు ఇంకా కొత్త విడుదల తేదీని ప్రకటించలేదు.

'కేజీఎఫ్-2' తర్వాత యశ్ నటిస్తోన్న చిత్రం ఇదే కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటించారు.

Advertisement
 
Advertisement
Advertisement