ఏప్రిల్‌లో స్టార్ట్‌ | Rajinikanth: Shooting for Thalaivar173 will begin in April | Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌లో స్టార్ట్‌

Jan 19 2026 3:23 AM | Updated on Jan 19 2026 3:23 AM

Rajinikanth: Shooting for Thalaivar173 will begin in April

‘తలైవర్‌ 173’ సినిమా చిత్రీకరణ వేసవిలో ప్రారంభం కానుంది. రజనీకాంత్‌ హీరోగా సిబీ చక్రవర్తి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘తలైవర్‌ 173’ (వర్కింగ్‌ టైటిల్‌). కమల్‌హాసన్, ఆర్‌. మహేంద్రన్‌ నిర్మించనున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రోడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.

కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ జానర్‌లో ఈ సినిమా కథనం సాగుతుందని ఇటీవల ఓ సందర్భంలో రజనీకాంత్‌ పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని 2027 పొంగల్‌ పండగ సందర్భంగా రిలీజ్‌ చేయనున్నట్లుగా మేకర్స్‌ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రస్తుతం ‘జైలర్‌ 2’ చిత్రీకరణతో బిజీగా ఉంటున్నారు రజనీకాంత్‌. ఈ సినిమా కొత్త షూటింగ్‌ షెడ్యూల్‌ వచ్చే వారంలో ప్రారంభం కానుందని కోలీవుడ్‌ సమాచారం. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ‘జైలర్‌ 2’ ఈ ఏడాది జూన్‌లో విడుదల కానుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement