హీరోయిన్‌కు పెళ్లి ప్రపోజల్‌.. ముందు కెరీర్‌పై ఫోకస్‌ చేయ్‌! | Actress Avantika Mohan about Marriage Proposals | Sakshi
Sakshi News home page

బుడ్డోడా.. నాకు ఆల్‌రెడీ పెళ్లయిందిరా: మ్యారేజ్‌ ప్రపోజల్‌పై హీరోయిన్‌ రియక్షన్‌

Jan 22 2026 3:22 PM | Updated on Jan 22 2026 3:31 PM

Actress Avantika Mohan about Marriage Proposals

సెలబ్రిటీకు ప్రపోజల్స్‌ రావడం అనేది చాలా కామన్‌. అయితే చిన్నపిల్లలు కూడా ప్రపోజ్‌ చేస్తున్నారని, అదే కాస్త ఆశ్చర్యంగా ఉందంటోంది హీరోయిన్‌ అవంతిక మోహన్‌. టీనేజ్‌ పిల్లలు పెళ్లి చేసుకోమని అడుగుతున్నారని చెప్తోంది. ఈ మేరకు కొన్ని స్క్రీన్‌షాట్స్‌ షేర్‌ చేసింది. అందులో ఓ అబ్బాయి.. కేరళలో చాలామంది నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. వారిలో నేనూ ఒకడిని అన్నాడు. 

చిన్న వయసులో ఎంత ధైర్యమో..
ఆ మెసేజ్‌కు అవంతిక స్పందిస్తూ.. ఈ పిల్లాడిని చూడండి.. అంత చిన్నవయసులోనే ఎంత ధైర్యమో! చిన్నోడా.. నేను చెప్పేదేంటంటే నాకు ఆల్‌రెడీ పెళ్లయిపోయింది. కాబట్టి నా గురించి ఆలోచించకుండా వెళ్లి నీ హోమ్‌వర్క్‌ చేసుకో.. నా జీవితంలో కొత్త హీరో ఎంట్రీకి ఛాన్స్‌ లేదు. నీ కెరీర్‌ మీద ఫోకస్‌ చేయు అని చెప్పుకొచ్చింది.

నిన్ను పెళ్లి చేసుకోవచ్చా? 
మరో స్క్రీన్‌షాట్‌లో ఓ యువకుడు నేను నిన్ను పెళ్లి చేసుకోవచ్చా? అని అడిగాడు. అది చూసిన అవంతికకు కోపం రాలేదు, నవ్వొచ్చింది. నీ మెసేజ్‌ చూడగానే నాకు నిజంగా నవ్వొచ్చింది. నీకు దాదాపు 20 ఏళ్లు ఉంటాయనుకుంటా.. చాలా రాంగ్‌ టైమ్‌ ఇది! అయినా సరే నీ ధైర్యాన్ని మెచ్చుకుని తీరాల్సిందే!

సినిమా
సరైన సమయం వచ్చినప్పుడు కరెక్ట్‌ పర్సన్‌ నీ జీవితంలోకి వస్తారు.. అప్పటివరకు జీవితాన్ని ఆస్వాదించు అని రిప్లై ఇచ్చింది. అవంతికకు ఇలాంటి ప్రపోజల్స్‌ గతంలోనూ వచ్చాయి. సినిమాల విషయానికి వస్తే.. అవంతిక యక్షి: ఫేత్‌ఫుల్లీ యువర్స్‌, నీలాకాశం పచ్చకాదల్‌ చువన్న భూమి, క్రొకొడైల్‌ లవ్‌ స్టోరీ వంటి పలు మలయాళ చిత్రాల్లో నటించింది. తెలుగులో ఉందిలే మంచి కాలం ముందు ముందున సినిమాలో హీరోయిన్‌గా యాక్ట్‌ చేసింది.

చదవండి: నన్ను వాడుకుని వదిలేశారు: శర్వానంద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement