మిమిక్రీ ఆర్టిస్ట్‌ నుంచి హీరోగా.. అదే అతి పెద్ద బాధ! | Actor Jayaram Struggles and Cinema | Sakshi
Sakshi News home page

ఈ స్టార్‌ హీరోను ఎవరూ లెక్కచేయలేదా?.. 38 ఏళ్లుగా ఒకే సర్కిల్‌!

Jan 23 2026 6:19 PM | Updated on Jan 23 2026 6:46 PM

Actor Jayaram Struggles and Cinema

సూర్యుడు అస్తమించాకే చంద్రుడు వస్తాడు.. చంద్రుడు వెళ్లిపోయాకే సూర్యుడు ఉదయిస్తాడు.. నటుడు జయరామ్‌ కెరీర్‌ కూడా అంతే! హిట్లు వచ్చిన వెంటనే ఫ్లాపులు వస్తాయి.. ఆ వరుస ఫ్లాపులు వచ్చాకే మళ్లీ హిట్లు కరుణిస్తాయి. తన కెరీర్‌ అంతా ఇలాగే కొనసాగుతోందంటున్నాడు జయరామ్‌. ఆయన కెరీర్‌ను, స్ట్రగుల్స్‌ను ఓసారి చూసేద్దాం..

మిమిక్రీ ఆర్టిస్ట్‌ నుంచి హీరోగా..
జయరాం సుబ్రహ్మణ్యం.. కాలేజీ అయిపోయిన వెంటనే మెడికల్‌ రిప్రజెంటేటివ్‌గా పనిచేశాడు. తర్వాత కళాభవన్‌ సంస్థలో చేరి మిమిక్రీ నేర్చుకున్నాడు. ఆ మిమిక్రీయే అతడిని నటనవైపు అడుగులు వేసేలా చేసింది. 22 ఏళ్లకే అపరన్‌ అనే మలయాళ మూవీతో హీరోగా మారాడు. 'మెలెపరంబిల్‌ ఆన్వీడు' చిత్రంతో మలయాళ స్టార్‌గా ఎదిగాడు. మూడు దశాబ్దాలపాటు ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాలు చేశాడు. అయితే జయాపజయాలు ఒకదాని వెంట ఒకటి వచ్చేసరికి తడబడ్డాడు. 

తడబాటు
హీరోగా మూడుసార్లు ఫిలింఫేర్‌ అవార్డు గెలిచిన జయరామ్‌ మలయాళ భాషకే పరిమితం కాకుండా తమిళ, తెలుగు చిత్రాల్లోనూ నటించాడు. దాదాపు 200కి పైగా చిత్రాల్లో యాక్ట్‌ చేశాడు. కాకపోతే ఇతర భాషల్లో సహాయక పాత్రలు, విలన్‌ పాత్రలు చేసుకుంటూ వస్తున్నాడు. ఈయన తెలుగులో భాగమతి, అల వైకుంఠపురములో, రాధేశ్యామ్‌, ధమాకా, ఖుషి, హాయ్‌ నాన్న, గుంటూరు కారం సినిమాలు చేశాడు. గతేడాది తెలుగులో గేమ్‌ ఛేంజర్‌, మిరాయ్‌.., తమిళంలో రెట్రో, కన్నడలో కాంతార: చాప్టర్‌ 1 సినిమాల్లో కనిపించాడు.

సక్సెస్‌ వెంటనే ఫెయిల్యూర్‌
జయరామ్‌ తన కెరీర్‌ గురించి మాట్లాడుతూ.. అదేంటో కానీ నేను రెండుమూడు విజయవంతమైన సినిమాలు చేసినవెంటనే కచ్చితంగా రెండు మూడు ఫ్లాపులు వస్తుంటాయి. దాంతో మళ్లీ లేచి నిలబడటానికి ప్రయత్నించేవాడిని. గత 38 ఏళ్లుగా ఇదే జరుగుతోంది. కెరీర్‌ ప్రారంభంలో పెద్దపెద్ద దర్శకులతో హీరోగా అనేక సినిమాలు చేశాను. కానీ అంతలోనే మళ్లీ అపజయాలు ఎదురయ్యేవి. వాటిని తట్టుకుని నిలబడటం కష్టంగా ఉండేది. కొందరైతే నా మీద ఆశలు వదిలేసుకున్నారు. నా పనైపోయిందన్నారు.

అదే ఎక్కువ బాధ
అన్నింటికన్నా బాధేంటో తెలుసా? సక్సెస్‌ అయినప్పుడు అందరూ పొగుడుతారు. కానీ కెరీర్‌ ఒడిదుడుకులకు లోనైనప్పుడు చిన్నచిన్న తప్పుల్ని కూడా భూతద్దంలో పెట్టి చూస్తారు, ఏదో ఒక రకంగా నిందిస్తారు, దూరం పెడతారు. అది చాలా బాధేస్తుంది. కానీ ఈ అనుభవాల వల్ల చాలా నేర్చుకున్నాను అంటున్నాడు. ప్రస్తుతం జయరామ్‌ ఆశకల్‌ ఆయిరామ్‌ సినిమా చేస్తున్నాడు. ఇందులో ఆయన కుమారుడు కాళిదాసు కూడా నటించాడు. జి.ప్రజిత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న విడుదల కానుంది.

చదవండి: ఆ హీరోకు యాక్టింగే రాదు, ఏదో కవర్‌ చేస్తాడంతే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement