బాలీవుడ్‌లో ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా రాణించింది రిమి సేన్. ఇప్పుడు మాత్రం సినిమాలకు గుడ్‌బై చెప్పేసి దుబాయ్‌లో రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా పని చేస్తోంది. ఇండియాలో ఏజెంట్లను ఏదో తప్పుపనిచేసేవారిలా చూస్తారు, కానీ అక్కడ దర్జాగా బతుకుతున్నానని చెప్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్‌లోని ఓ టాప్ హీరోకు యాక్టింగ్ రాదని గాలి తీసింది. అదే సమయంలో అతడి తెలివితేటల్ని మెచ్చుకుంది.
యాక్టింగ్ రాదన్న కామెంట్స్
ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు జాన్ అబ్రహం. రిమి సేన్ మాట్లాడుతూ.. జాన్ అబ్రహం నాకు వ్యక్తిగతంగా తెలుసు. అతడు మొదట్లో మోడల్‌గా పని చేశాడు. యాక్టింగ్ అనేదే రాదు. ఆ విషయం గురించి అందరూ మాట్లాడుతుంటే అతడు పట్టించుకునేవాడు కాదు. అతడు కేవలం తన యాక్టింగ్‌కు బదులుగా స్టైలిష్‌గా, స్క్రీన్‌పై మరింత బాగా కనిపించే పాత్రల్ని మాత్రమే ఎంచుకునేవాడు. ఉదాహరణకు యాక్షన్ సినిమాలు.
తెలివైనవాడు
ఆ సినిమాల్లో అతడు బాగా కనిపించేవాడు, అప్పుడు జనాలు అతడేం చేస్తున్నాడనేది పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఆ రకంగా అతడు చాలా తెలివైన నటుడు. అయితే పాపులారిటీ పెరుగుతూ ఉండేసరికి అతడే నెమ్మదిగా యాక్టింగ్ నేర్చుకున్నాడు. పదేపదే కెమెరా ముందుకు వస్తూ ఉంటే అది మనకు ఎంతో కొంత అనుభవం నేర్పుతుంది కదా. అలా తనపై తనకు నమ్మకం ఏర్పడ్డాక నటనకు అవకాశమున్న పాత్రల్ని ఎంచుకున్నాడు.
రానురానూ..
తన పరిధులేంటో తనకు బాగా తెలుసు కాబట్టే మొదట్లో యాక్షన్.. రానురానూ పర్ఫామెన్స్‌కు ప్రాధాన్యత ఇచ్చాడు. అందుకే అతడిని తెలివైనవాడని చెప్తుంటాను. తర్వాత నిర్మాణరంగంలోనూ అడుగుపెట్టి హిట్లు కొట్టాడు, బిజినెస్‌మెన్‌గా రాణించాడు అని రిమి సేన్ చెప్పుకొచ్చింది. జాన్ అబ్రహం, రిమి సేన్.. ధూమ్, గరం మసాలా, హ్యాట్రిక్ సినిమాల్లో కలిసి నటించారు. జాన్ అబ్రహం సినిమాల విషయానికి వస్తే.. ఈయన చివరగా టెహ్రాన్ సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం ఇతడి చేతిలో రెండు సినిమాలున్నాయి.


