సెలబ్రిటీలు ప్రేమలో ఉంటే ఇట్టే తెలిసిపోతుంది. కానీ, హీరోయిన్ కీర్తి సురేశ్ మాత్రం తన ప్రేమను సీక్రెట్‌గా ఉంచింది. ఒకటీరెండేళ్లు కాదు, ఏకంగా 15 ఏళ్లు! పన్నెండో తరగతిలోనే ఆంటోని తటిల్‌తో లవ్‌లో పడ్డ కీర్తి.. స్టార్ హీరోయిన్ అయ్యాక కూడా ఆ రిలేషన్‌ను కొనసాగించింది. మనసుపడ్డవాడినే మనువాడింది. 2024లో హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయల ప్రకారం వీరి పెళ్లి జరిగింది.
ఇంటి పేరు
తాజాగా ఈ దంపతులు తమ హోమ్ టూర్ వీడియోతో వార్తల్లోకెక్కారు. కొచ్చిలో వాళ్లుంటున్న ఇంటిని చూపించారు. ఆ భవంతికి హౌస్ ఆఫ్ ఫన్ అనే పేరు పెట్టినట్లు తెలిపారు. ఫ్యామిలీ ఫోటోలు, పెళ్లి ఫోటోలు, మహానటి సినిమాకుగానూ జాతీయ అవార్డు అందుకున్నప్పుడు తనపై వచ్చిన వార్తల కథనాల క్లిప్పింగ్స్‌ను కీర్తి చూపించింది. ముఖ్యంగా తన జ్ఞాపకాలకు, అనుభవాలకు వేదికైన మెమొరీ వాల్ అన్నింటికంటే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఇల్లులా లేదు
తన పెంపుడు కుక్కలు నైక్, కెన్నీ కోసం స్పెషల్ రూమ్ కూడా ఏర్పాటు చేసింది. సాంప్రదాయాన్ని, మోడ్రన్‌ను మిక్స్ చేసేలా ఇంటీరియర్ డిజైన్ ఉంది. బాల్కనీ మాత్రం మొక్కలతో పచ్చదనం పరుచుకున్నట్లుగా కనిపిస్తోంది. అయితే ఈ భవంతి చూసిన నెటిజన్లు.. ఇది వారి ఇల్లులా కనిపించట్లేదు, కెఫెలా ఉందని, బాగుందని కామెంట్లు చేస్తున్నారు.
సినిమా
హీరోయిన్‌గా కీర్తి సురేశ్ సూపర్ సక్సెస్.. అటు కమర్షియల్ సినిమాలతో పాటు ఇటు లేడీ ఓరియంటెడ్ సినిమాలూ చేస్తోంది. అయితే భవిష్యత్తులో దర్శకురాలిని అవ్వాలని ఉందని ఆ మధ్య మనసులోని మాట బయటపెట్టింది. గత ఐదారేళ్లుగా తనకు వచ్చిన ఐడియాలను రాసిపెట్టుకున్నట్లు తెలిపింది. మహానటి సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన రౌడీ జనార్దన సినిమాలో నటిస్తోంది. అలాగే తమిళ, మలయాళంలోనూ ఒక్కో సినిమా చేస్తోంది.


