నా ఫోటోలు చూసి అమ్మ ఏడ్చేసింది: దివ్య భారతి | Actress Divya Bharathi About Childhood And Movies | Sakshi
Sakshi News home page

Divya Bharathi: నన్ను ఇంట్లో ఉంచి తాళం వేసేది.. ప్రొఫెసర్‌తో లవ్‌..

Jan 23 2026 3:08 PM | Updated on Jan 23 2026 3:28 PM

Actress Divya Bharathi About Childhood And Movies

అనుకోకుండా సినిమాల్లోకి వచ్చినవారిలో హీరోయిన్‌ దివ్య భారతి ఒకరు. బ్యాచిలర్‌ అనే తమిళ చిత్రంతో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమైంది. చివరగా కింగ్‌స్టన్‌ మూవీతో పలకరించింది. ప్రస్తుతం తెలుగులో గోట్‌ సినిమా చేస్తోంది. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనేక విషయాలను పంచుకుంది.

అమ్మ సింగిల్‌ పేరెంట్‌
దివ్య భారతి మాట్లాడుతూ.. మా అమ్మకు హీరోయిన్‌ దివ్యభారతి అంటే ఇష్టం. ఆమె చనిపోయినప్పుడు తనపై ఇష్టంతో నాకు ఆ పేరు పెట్టారు. మా అమ్మ సింగిల్‌ పేరెంట్‌. చాలా స్ట్రిక్ట్‌గా ఉండేది. నేను నాలుగో తరగతి చదువుతున్నప్పుడు పేరెంట్స్‌ విడిపోయారు. చిన్నప్పుడు స్కూల్‌కు హాలీడేస్‌ వస్తే నన్ను, తమ్ముడిని.. అమ్మ ఇంట్లో పెట్టి తాళం వేసి పనికి వెళ్లేది. ఒకరోజు మేము తప్పించుకుని బయటకు వెళ్లి ఆడుకున్నాం. అమ్మ అది చూసి గోడకుర్చీ వేయించింది.

ప్రొఫెసర్‌తో లవ్‌
ప్రేమ విషయానికి వస్తే.. అలాంటి స్టోరీలేం లేవు. కాకపోతే బీటెక్‌ ఫైనలియర్‌ చదువుతున్నప్పుడు ఓ అబ్బాయిని చూసి ఇష్టపడ్డాను. తర్వాతి రోజు ప్రొఫెసర్‌ ఫోన్‌ చేసి.. నువ్వు చూసింది నన్నే అన్నాడు. అలా ఆయన ప్రొఫెసర్‌ అని తెలిసి సారీ చెప్పాను. కానీ, తర్వాత కూడా ఇద్దరం మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం. కాలేజీ అయిపోయాక మా అమ్మ.. నువ్వు చూడాల్సిన జీవితం చాలా ఉంది. ఇక్కడే ఆగిపోకు అంది. అలా ఇద్దరం ఎవరిదారి వారు చూసుకున్నాం.

అమ్మ ఒకటే ఏడుపు
నా బాల్యం, చదువు అంతా కోయంబత్తూరులోనే జరిగింది. ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు కోసం 2014లో చెన్నై వచ్చాను. అప్పుడు మోడలింగ్‌ గురించి పరిచయం ఏర్పడింది. అప్పటివరకు నేను మోడ్రన్‌ డ్రెస్‌ వేసిందే లేదు. ఫ్యాషన్‌ షోలో తొలిసారి పాల్గొన్నాను. కాస్త నడుము కనిపించేలా లెహంగా వేసుకున్నాను. ఆ ఫోటోలు చూసి అమ్మ ఫోన్‌ చేసి ఏడ్చేసింది. 

ఎందుకిలాంటి డ్రెస్‌లు!
నేను నిన్ను ఇలా పెంచలేదు, ఎందుకిలాంటి డ్రెస్‌లు వేసుకుంటున్నావు? అని బాధపడింది. అలాంటి అమ్మ ఇప్పుడు నేను హీరోయిన్‌గా చేస్తుంటే సపోర్ట్‌గా నిలబడింది. మోడలింగ్‌ చేస్తున్నప్పుడు చాలా సినిమా ఆఫర్లు వచ్చాయి. కాకపోతే జనాలు నన్ను ఇష్టపడతారా? అని నాపై నాకే అనుమానం ఉండేది. అందుకే చాలా కథలకు నో చెప్పుకుంటూ వచ్చాను. అలా బ్యాచిలర్‌ సినిమాకు సైతం నో చెప్పాను. ఏడాది తర్వాత మళ్లీ అడిగారు. కథ నచ్చి ఓకే చేశాను. అలా సినీ ఎంట్రీ జరిగింది అని దివ్య భారతి చెప్పుకొచ్చింది.

చదవండి: రజనీకాంత్‌ సినిమాలు చూడలేం, చిరంజీవి కూడా అంతే!: అనిల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement