కోలీవుడ్ స్టార్ విశాల్ చాలా రోజుల గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. తన ఫెవరేట్ డైరెక్టర్ సుందర్ సితో మరోసారి జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీకి పురుషన్ అనే టైటిల్ ఖరారు చేశారు. తెలుగులో మొగుడు పేరుతో రిలీజ్ చేయనున్నారు. టైటిల్ రివీల్ చేస్తూ ఏకంగా ఐదు నిమిషాల వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ మూవీలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ వీడియో యోగిబాబుతో తమన్నా చేసే కామెడీ ఫుల్‌గా నవ్వులు తెప్పిస్తోంది. ఆ తర్వాత వంటగదిలో విశాల్ చేసే ఫైట్ వేరే లెవెల్లో ఉంది. ఇది చూసిన యోగిబాబు రియాక్షన్ చూస్తే సీరియస్ సీన్‌లో కామెడీ చేయడం అద్భుతంగా అనిపిస్తోంది. 'మొగుడులా ఉండటం ముఖ్యం కాదు.. మొగుడు మొగుడులా ఉండటమే ముఖ్యం. అర్థమైందా అత్తయ్యా..' అంటూ యోగిబాబు చెప్పే డైలాగ్‌లు నవ్వులు తెప్పిస్తున్నాయి.
గోపిచంద్ టైటిల్‌నే..
అయితే ఈ మూవీ టైటిల్ మొగుడు కావడం చర్చనీయాంశంగా మారింది. గతంలో తెలుగులో కృష్ణవంశీ దర్శకత్వంలో గోపిచంద్, తాప్సీ జంటగా వచ్చిన మూవీ టైటిల్ మొగుడు కావడం విశేషం. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయింది. 2011లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఏ మాత్రం మెప్పించలేకపోయింది. ఇప్పుడు అదే టైటిల్‌తో విశాల్ ప్రయోగం చేయడం కలిసొస్తుందా? డిజాస్టర్ అవుతుందా? వేచి చూడాల్సిందే.
Well well well…#KushbuPurushan da wishing my darling brother a very very happy entertaining and fun filled t birthday of my favourte director #SundarC, i am supa happy to kickstart my next film #Vishal36 titled as #Purushan with him for the 4th time after the grand success of…
— Vishal (@VishalKOfficial) January 21, 2026


