మమ్ముట్టి 'పాదయాత్ర' చేసేందుకు రెడీ అయిపోయారు. స్వతహాగా ఈయన మలయాళ హీరోనే అయినప్పటికీ తెలుగులోనూ బోలెడంత ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికీ ఓటీటీల్లో డబ్బింగ్ చిత్రాల రూపంలో అప్పుడప్పుడు పలకరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు 'పాదయాత్ర' గురించి అనౌన్స్‌మెంట్ ఇచ్చారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా గతంలో తీసిన 'యాత్ర' సినిమాలో మమ్ముట్టి టైటిల్ రోల్ పోషించారు. వైఎస్ఆర్‌గా అద్భుతమైన యాక్టింగ్ చేసి ఆకట్టుకున్నారు. రీసెంట్ టైంలో అయితే తన నిర్మాణంలోనే కన్నూర్ స్క్వాడ్, కలంకావళ్ అనే చిత్రాలతో వావ్ అనిపించారు. కలంకావళ్ చిత్రంలో అయితే మహిళల్ని చంపే సైకో పాత్రలో అలరించారు. ఇప్పుడు తన నిర్మాణంలోనే 'పాదయాత్ర' అనే మూవీని ప్రకటించారు.
(ఇదీ చదవండి: మమ్ముట్టి సైకో కిల్లర్ 'కలాం కావల్' మూవీ రివ్యూ..)

సాధారణంగా 'పాదయాత్ర' అంటే రాజకీయ పరిభాషలోనే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. మరి మమ్ముట్టి ఇప్పుడు తీయబోయేది కూడా పొలిటికల్ సినిమాయేనా? లేదంటే ఏదైనా డిఫరెంట్ కాన్సెప్ట్ అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే పోస్టర్ మాత్రమే రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి అదూర్ గోపాలకృష్ణన్ దర్శకుడు. 84 ఏళ్ల ఈ డైరెక్టర్‌తో మమ్ముట్టి.. 32 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి పనిచేయనుండటం విశేషం. గతంలో వీళ్లిద్దరూ 'విధేయన్' అనే మూవీ చేశారు. దానికి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా జాతీయ అవార్డ్ కూడా వచ్చింది.
అదూర్ గోపాలకృష్ణన్ విషయానికొస్తే.. 1965 నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఎక్కువగా డాక్యుమెంటరీలు తీశారు. కొన్ని ఫీచర్ ఫిల్మ్స్ కూడా తెరకెక్కించారు. 1972లో ఈయన తీసిన 'స్వయంవరం' చిత్రానికి ఉత్తమ సినిమా, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, ఉత్తమ సినిమాటోగ్రాఫర్ విభాగాల్లో జాతీయ అవార్డులు వచ్చాయి. తర్వాత కాలంలోనూ 'కొడియట్టం', విధేయన్, మథిలుకళ్, అనంతరం, ముఖాముఖం, ఎలిపత్యం, కథాపురుషన్, నిళల్ కుతు, నాళ్ పెన్నుంగళ్ తదితర మూవీస్‌తోనూ ఈయన జాతీయ అవార్డులు దక్కించుకున్నారు. చివరగా 2016లో ఓ సినిమా చేసిన ఈయన.. ఇన్నాళ్లకు మమ్ముట్టి కలిసి పనిచేయబోతుండటం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. ఈసారి 'పాదయాత్ర'తో మరో జాతీయ అవార్డ్ కొడతారేమో చూడాలి?
(ఇదీ చదవండి: ఓటీటీల్లో ఒక్క రోజే 15 సినిమాలు.. ఆ రెండే స్పెషల్..!)
'പദയാത്ര' ആരംഭിക്കുന്നു...
Proudly Presenting The Title Poster of Our Production No.8 "Padayaatra" Directed by Adoor Gopalakrishnan.#Mammootty #AdoorGopalakrishnan #Padayaatra #MammoottyKampany #WayfarerFilms pic.twitter.com/XwCF2oERUd— MammoottyKampany (@MKampanyOffl) January 23, 2026


