త్వరలో ధనుశ్ -మృణాల్‌ పెళ్లి.. తేదీ కూడా ఫిక్స్..! | Mrunal Thakur and Dhanush planning to get married in a private ceremony | Sakshi
Sakshi News home page

Mrunal Thakur - Dhanush: త్వరలో ధనుశ్ -మృణాల్‌ పెళ్లి.. తేదీ కూడా ఫిక్స్..!

Jan 15 2026 2:52 PM | Updated on Jan 15 2026 3:18 PM

Mrunal Thakur and Dhanush planning to get married in a private ceremony

సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్‌ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. టాలీవుడ్ ఎంట్రీతోనే సూపర్ హిట్‌ కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం అడివి శేష్ హీరోగా వస్తోన్న డకాయిట్ చిత్రంలో మెప్పించనుంది.  ఈ సినిమా సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక సినీ కెరీర్ సంగతి పక్కన పెడితే.. మృణాల్ వ్యక్తిగత జీవితంపై గత కొన్ని నెలలుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఆమె కోలీవుడ్ స్టార్ ధనుశ్‌తో డేటింగ్‌లో ఉన్నారని వార్తలొచ్చాయి. అయితే వీటిపై ఇ‍ద్దరు కూడా స్పందించలేదు. ఆ తర్వాత  మృణాల్ ధనుష్  సిస్టర్స్‌ డాక్టర్ కార్తీక కృష్ణమూర్తి, విమల గీతలను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో కావడంతో ఆ రూమర్స్‌కు మరింత బలం చేకూరింది. అంతేకాకుండా వారిద్దరు కూడా మృణాల్‌ను  ఫాలో అయ్యారు. ఇక ఈ జంట డేటింగ్‌ కన్‌ఫామ్ అని చాలామంది ఫిక్సయిపోయారు.

తాజాగా ఈ జంటపై మరో రూమర్ నెట్టింట వైరలవుతోంది. వీరిద్దరు త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారని లేటేస్ట్ టాక్. తాజాగా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం వచ్చేనెల 14న మృణాల్- ధనుశ్ ఒక్కటి కాబోతున్నారని సోషల్ మీడియాలో వైరలవుతోంది. అయితే ఈ పెళ్లికి కేవలం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కానున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరు కూడా తమ పర్సనల్‌ లైఫ్‌లో ఎల్లప్పుడూ గోప్యతను పాటిస్తారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ వార్తలపై మృణాల్ ఠాకూర్ కానీ, ధనుశ్  స్పందించలేదు. ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తేనే ఈ రూమర్స్‌కు చెక్‌ పడనుంది.

కాగా.. గతేడాది ఆగష్టు 1న మృణాల్ పుట్టినరోజు వేడుకలో ధనుశ్ పాల్గొన్నారు. పార్టీ వీడియోలో ధనుష్ ఆమె చేతిని పట్టుకుని ఆత్మీయంగా మాట్లాడుతున్న దృశ్యం ఒకటి వైరలైంది. ఆపై మృణాల్ ఠాకూర్‌ నటించిన కొత్త సినిమా 'సన్ ఆఫ్ సర్దార్ 2' స్పెషల్ స్క్రీనింగ్‌కు ధనుష్ ప్రత్యేకంగా ముంబయికి వెళ్లారు. స్క్రీనింగ్ సమయంలో ధనుష్ చెవిలో మృణాల్ ఏదో గుసగుసలాడటం కనిపించింది. అంతకుముందు ధనుశ్‌ మూవీ 'తేరే ఇష్క్ మే' పార్టీకి మృణాల్ కూడా హాజరయ్యారు. అక్కడ కూడా వీరిద్దరూ కలిసి కనిపించారు. అప్పటి నుంచి వారిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తలొచ్చాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement