'పుష్ప 2' తర్వాత ఆచితూచి సినిమాలు ప్లాన్ చేస్తున్న అల్లు అర్జున్.. ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో కలిసి పనిచేస్తున్నాడు. దీని షూటింగ్ ఇప్పటికే జరిగింది. వచ్చే ఏడాది ఇది రిలీజయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు తమిళ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్‌తో బన్నీ కొత్త మూవీ చేయబోతున్నాడని వారం పదిరోజుల క్రితం అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ గురించి స్వయంగా లోకేశ్ మాట్లాడాడు. ఓ సీక్రెట్ చెప్పేశాడు.
తాజాగా ఓ మూవీ ఈవెంట్‌లో పాల్గొన్న లోకేశ్ కనగరాజ్‌కి యాంకర్ నుంచి ప్రశ్న ఎదురైంది. ప్రేక్షకుల అంచనాలు లేకుండా మీ డ్రీమ్ ప్రాజెక్ట్ తీయాలనుకుంటే అది ఎలా ఉండబోతుంది? అని యాంకర్ అడగ్గా.. నా తర్వాతి సినిమా(#AA23) అలానే ఉండబోతుంది అని లోకేశ్ క్లారిటీ ఇచ్చేశాడు. దీంతో బన్నీ ఫ్యాన్స్ అంచనాలు పెంచేసుకుంటున్నారు. ఎందుకంటే లోకేశ్ గతంలో ఖైదీ, విక్రమ్ లాంటి స్టైలిష్ మూవీస్ తీశాడు. డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే వాటిని మించే ఉండొచ్చు.
(ఇదీ చదవండి: ట్రెండింగ్‌లో 'ఒంటరి పెంగ్విన్'.. ఇంతకీ ఏంటి దీని స్టోరీ?)
చాన్నాళ్ల క్రితమే లోకేశ్ ఓ సూపర్ హీరో తరహా స్టోరీ అనుకున్నాడు. ఇందులో హీరోకి ఓ చేయి ఉండదు. బదులుగా ఓ ఐరన్ హ్యాండ్ అమర్చుతారు. అప్పటినుంచి సదరు హీరోకి సూపర్ పవర్స్ వస్తాయి. ఇదే తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని పలు సందర్భాల్లో లోకేశ్ చెప్పాడు. తొలుత హీరో సూర్యతో ఇది చేద్దామనుకున్నాడు. గతేడాది ఆమిర్ ఖాన్ పేరు వినిపించింది. కానీ ఇప్పుడదే ప్రాజెక్ట్ అల్లు అర్జున్‌తో చేస్తున్నాడా? అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే బన్నీతో చేస్తున్న మూవీ కోసం అనౌన్స్ చేసిన వీడియోలో.. సినిమా అడవి బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతుందని మరి అది ఇది ఒకటేనా అనేది తెలియాల్సి ఉంది.
మరోవైపు అల్లు అర్జున్ మూవీ కోసం లోకేశ్ కనగరాజ్.. ఇప్పటికే హైదరాబాద్‌లో ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలుపెట్టేశాడు. కేవలం నాలుగు నెలల్లోనే మూవీ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారట. అట్లీ ప్రాజెక్ట్ నుంచి కాస్త ఫ్రీ అయిన వెంటనే అల్లు అర్జున్ దీన్ని చేస్తాడని తెలుస్తోంది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి కొత్త తెలుగు సినిమా.. ట్రయాంగిల్ లవ్ స్టోరీ)
#AA23xLK7
Biggest movie in @Dir_Lokesh career... 😳🥵💥
The Madness doubled now onwards...🥵☠️#AlluArjun#LokeshKanagaraj#AnirudhRavichander
pic.twitter.com/H32nHFQrtB— Allu Arjun fan ikkadaa (@AAFanIkkadaa) January 24, 2026


