ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ సారా అర్జున్ బాలీవుడ్ మూవీ 'ధురంధర్'తో హీరోయిన్‌గా మారింది. యలీనా జమైల్ పాత్రలో ప్రేక్షకుల్ని మెప్పించింది. ఇప్పుడు 'యుఫోరియా' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైంది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫిబ్రవరి 6న విడుదల కానుంది.
ఆరోజు మర్చిపోలేను
సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సారా అలీ ఖాన్ పలు ఇంటర్వ్యూలకు హాజరవుతోంది. ఈ సందర్భంగా తను హీరోయిన్ అయ్యాక పేరెంట్స్ రియాక్షన్ గురించి చెప్పుకొచ్చింది. ధురంధర్ సినిమాలో నన్ను చూసి అమ్మానాన్న సంతోషంతో ఏడ్చేశారు. ఆ రోజు నేనెప్పటికీ మర్చిపోలేను. ఆ సంఘటన నా జీవితంలోనే ప్రత్యేకమైనది అని చెప్పుకొచ్చింది. ఆమె ఇంకా మాట్లాడుతూ.. పొన్నియన్ సెల్వన్ మూవీ తర్వాత విదేశాల్లో యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాలనుకున్నాను.
ధురంధర్
అంతలోనే యుఫోరియా సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. ఈ మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ధురంధర్ సినిమాకు సంతకం చేశాను. కానీ అదే మొదటగా రిలీజైంది అని తెలిపింది. రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ధురంధర్ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. ఈ మూవీకి సీక్వెల్‌గా ధురంధర్ 2 తెరకెక్కుతోంది. ఈ చిత్రం మార్చి 19న విడుదల కానుంది.


