చెన్నై: ప్రముఖ నటి ఊర్వశి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆమె సోదరుడు, నటుడు కమల్ రాయ్ (54) చెన్నైలో కన్నుమూశారు. కమల్ రాయ్ మృతి పట్ల దర్శకుడు వినాయన్ తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. ఊర్వశి, కల్పన, కలారంజినిల సోదరుడే కమల్ రాయ్. ఈయన కల్యాణసౌగంధికం సినిమాలో విలన్‌గా నటించాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని దేవుడిని ప్రార్థించాడు.
నటులు చావర వీపీ నాయర్- విజయలక్ష్మిల సంతానమే కమల్ రాయ్. అతడికి ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. వారే ఊర్వశి, కళారంజిని, కల్పన. ఈ ముగ్గురు కూడా యాక్టర్స్‌గా సుపరిచితులే. వీరితో పాటు ఓ సోదరుడు కూడా ఉండేవాడు. అతడి పేరు ప్రిన్స్. చిన్నవయసులోనే అతడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.
కమల్ రాయ్ విషయానికి వస్తే.. సాయుజయం, కొల్లైలక్కం, మంజు, కింగిని, కల్యాణ సౌగంధికం, వచలం, శోభనం, ద కింగ్ మేకర్, లీడర్ వంటి పలు మలయాళ చిత్రాల్లో నటించారు. మోహన్‌లాల్, ఊర్వశి హీరోహీరోయిన్‌గా నటించిన యువజనోల్సవం మూవీలో విలన్‌గా యాక్ట్ చేశారు. తమిళ సినిమాల్లోనూ నటించారు. బుల్లితెరపై కొన్ని సీరియల్స్‌లోనూ మెరిశారు.
చదవండి: భారత్‌లో బిజినెస్ చేయలేక దుబాయ్‌కు చెక్కేసిన హీరోయిన్


