ఏనుగు దత్తత తీసుకున్న స్టార్‌ హీరో | Kollywood Star Hero Sivakarthikeyan Adopted elephant for six months | Sakshi
Sakshi News home page

Sivakarthikeyan: ఏనుగు దత్తత తీసుకున్న శివ కార్తికేయన్

Jan 20 2026 9:01 PM | Updated on Jan 20 2026 9:01 PM

Kollywood Star Hero Sivakarthikeyan Adopted elephant for six months

కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ తన గొప్ప మనసును చాటుకున్నారు. వండలూర్‌ జూ పార్క్‌లోని ఏనుగును దత్తత తీసుకున్నారు. ఆరునెలల పాటు ఆ ఏనుగు సంరక్షణ బాధ్యతలను హీరోనే చూసుకోనున్నారు. ప్రకృతి అనే పేరు గల ఏనుగు సంరక్షణను శివ కార్తికేయన్‌ పర్యవేక్షించనున్నారు. ఈ విషయాన్ని జూ పార్క్ అధికారులు అఫీషియల్‌గా ప్రకటించారు. ఇది చూసిన హీరో ఫ్యాన్స్.. అన్న గ్రేట్‌ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా.. శివ కార్తికేయన్ ఇటీవలే పరాశక్తి మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. పొంగల్ ‍కానుకగా ఈ మూవీ రిలీజైంది. సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం జనవరి 10న థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ మూవీపై కొందరు విమర్శలు చేశారు. ఈ సినిమాను పాలిటిక్స్‌తో లింక్ చేయడంతో వివాదానికి దారితీసింది. కాగా.. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా కనిపించింది. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement