పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ మరోసారి బాలీవుడ్ సూపర్‌స్టార్‌తో బాక్సాఫీస్ పోటీకి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఒకసారి బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్‌తో ప్రభాస్ పోటీ పడ్డారు. ఇప్పుడు కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో కూడా తలపడే అవకాశం కనిపిస్తోంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ సినిమాను 2027 మార్చి 5న విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ తేదీ వీకెండ్‌తో పాటు ఈద్ పండుగ సీజన్‌కి దగ్గరగా ఉండటంతో భారీగా కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇక సల్మాన్ ఖాన్ హీరోగా ప్రముఖ దర్శక ద్వయం రాజ్-డీకేతో కొత్త సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌ను త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమాను 2027 రంజాన్ సీజన్‌లో విడుదల చేయాలనే ప్లాన్ జరుగుతోంది. సల్మాన్ ఖాన్‌కు రంజాన్ సీజన్‌పై ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉంది. గతంలో అనేక సినిమాలను ఆయన ఈ సీజన్‌లో విడుదల చేసి విజయాలు సాధించాడు. అందుకే రాజ్-డీకే సినిమా కూడా అదే టైమ్‌లో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.
ఇప్పటికే ప్రభాస్ స్పిరిట్ సినిమాతో ఆ సీజన్‌ను లాక్ చేసుకున్నాడు. అదే సమయంలో సల్మాన్ సినిమా కూడా సిద్ధమవుతుందనే ప్రచారం నడుస్తోంది. రాజ్-డీకే ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించిన వెంటనే ఈ రెండు భారీ సినిమాల మధ్య పోటీపై స్పష్టత వస్తుంది. బాలీవుడ్‌లో ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేసినప్పుడే రిలీజ్ డేట్ కూడా ప్రకటించడం ఆనవాయితీ కావడంతో ఈ పోటీపై ఫ్యాన్స్‌లో ఆసక్తి పెరిగింది. 2027 రంజాన్ బాక్సాఫీస్‌లో ప్రభాస్ స్పిరిట్ vs సల్మాన్ ఖాన్ – రాజ్-డీకే సినిమా పోటీ ఒకవేళ నిజమైతే ఇది ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత పెద్ద క్లాష్‌గా నిలిచే అవకాశం ఉంది.


