
మహిళల వన్డే ప్రపంచకప్-2025లో భాగంగా వైజాగ్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ తొలుత బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. వర్షం కారణంగా మ్యాచ్ గంట నిమిషాల ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగింది.
పేసర్ రేణుకా సింగ్ స్ధానంలో ఆల్‌రౌండర్ అమన్ జ్యోత్ కౌర్ తుది జట్టులోకి వచ్చింది. సౌతాఫ్రికా జట్టులో కూడా ఓ మార్పు చోటు చేసుకుంది. మసాబాటా క్లాస్ స్దానంలో తుమీ సెఖుఖునేకి చోటు దక్కింది. భారత్ ఇప్పటికే రెండు మ్యాచ్‌లలో విజయం సాధించగా.. సౌతాఫ్రికా ఒక్క మ్యాచ్‌లో గెలిపొందింది.
తుది జట్లు
భారత మహిళలు (ప్లేయింగ్ XI): ప్రతీకా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్(సి), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, స్నేహ రాణా, క్రాంతి గౌడ్, శ్రీ చరణి
దక్షిణాఫ్రికా మహిళల జట్టు ప్లేయింగ్ XI: లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), తజ్మిన్ బ్రిట్స్, సునే లూయస్, మారిజానే కాప్, అన్నెకే బాష్, సినాలో జాఫ్తా (వికెట్ కీపర్), క్లో ట్రయాన్, నాడిన్ డి క్లెర్క్, అయాబొంగా ఖాకా, తుమీ సెఖుఖునే, మ్లాబా