పంచ్‌లో బెబ్బులి..కిక్‌ ఇస్తే.. ప్రత్యర్థులకు చుక్కలే ఎవరీ దేవి? | 2025 Karate 1-Youth in Uae League one and only player devihamsini | Sakshi
Sakshi News home page

పంచ్‌లో బెబ్బులి..కిక్‌ ఇస్తే.. ప్రత్యర్థులకు చుక్కలే ఎవరీ దేవి?

Jan 27 2025 10:21 AM | Updated on Jan 27 2025 11:50 AM

2025 Karate 1-Youth in Uae League one and only player devihamsini

పెరెగ్రైన్‌ ఫాల్కన్‌ కన్నా వేగవంతమైన కిక్‌లకు టెక్నిక్‌ మేళవించి ప్రత్యర్థులను మట్టి కరిపిస్తుంది. చిరుత కంటే వేగంగా పాదాలను కదిలించి ఎదుటివారిని చిత్తు చేస్తుంది. పాల్గొన్న ప్రతిపోటీలోనూ పతకం సాధించి తనకుతానే సాటిగా అంతర్జాతీయ వేదికపై మరోమారు సత్తా చూపించేందుకు సిద్ధమవుతోంది సికింద్రాబాద్‌ చిలకలగూడకు చెందిన కరాటే క్వీన్‌ దేవిహంసిని. ఇప్పటి వరకూ అనేక జాతీయ, అంతర్జాతీయ కరాటే పోటీల్లో పాల్గొని బంగారు, వెండి మెడల్స్‌తోపాటు పలు అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుంది.- చిలకలగూడ 

యనైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యుఏఈ) ఫుజైరాలో 2025 ఫిబ్రవరిలో జరిగే కరాటే–1 యూత్‌లీగ్‌ పోటీలకు అండర్‌–14 కటా విభాగంలో తెలంగాణ నుంచి ఎంపికైన ఏకైక క్రీడాకారిణి దేవిహంసిని. వడోరై కరాటే డూ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో యుఏఈలో జరిగే యూత్‌లీగ్‌ పోటీలకు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, తెలంగాణలకు చెందిన ఎనిమిది మందిని ఎంపిక చేశారు. 

చిన్ననాటి నుంచే.. 
సాధారణ కుటుంబానికి చెందిన పెబ్బిలి దేవిహంసిని (12) సికింద్రాబాద్‌ సెయింట్‌ మేరీ హైసూ్కల్లో ఏడో తరగతి చదువుతోంది. తండ్రి కోటేశ్వరరావు ప్రైవేటు ఉద్యోగి, తల్లి అంజలి గృహిణి. తన ఆరో ఏట నుంచే మార్షల్‌ ఆర్ట్స్‌పై చిన్ననాటి నుంచే మక్కువ పెంచుకుంది. మొదట విశాఖపట్నంలోని కింగ్‌ ఆఫ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ అసోసియేషన్‌లో చేరింది. కరాటే కోచ్‌ సిహాన్, సీహెచ్‌ శ్రీనివాసరావు వద్ద ఓనమాలు నేర్చుకుంది. కఠోరశ్రమ, చిత్తశుద్ధి, నేర్చుకోవాలనే తపనతో మెళకువలను ఔపోసన పట్టి బ్లాక్‌బెల్ట్‌ సాధించింది. సినీనటుడు సుమన్‌ నుంచి బ్లాక్‌బెల్ట్‌ అందుకోవడం గర్వంగా ఉందని చెబుతోంది దేవి. 

సాధించిన పతకాలు..
జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన దేవిహంసిని పాల్గొన్న ప్రతి పోటీలోనూ బహుమతి సాధించి విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. కటా, కుమిటీ విభాగాల్లో పది గోల్డ్, రెండు వెండి, జాతీయ స్థాయిలో 22 బంగారు, ఐదు వెండి, మూడు రజిత పతకాలు కైవసం చేసుకుంది. సౌత్‌ నేషనల్‌ లెవల్‌లో 7 గోల్డ్, ఒక్కో సిల్వర్, బ్రాంజ్, ఆసియన్‌ లెవల్‌లో ఒక్కో సిల్వర్, బ్రాంజ్, స్టేట్‌ లెవల్‌లో ఐదు బంగారు, ఒక్కో సిల్వర్, బ్రాంజ్‌ మెడల్స్‌ సొంతం చేసుకుంది. 

మువ్వన్నెల జెండా ఎగురవేస్తా.. 
అంతర్జాతీయ వేదికలపై మువ్వన్నెల జెండా ఎగురవేస్తా. యుఏఈ ఫుజైరాలో కరాటే యూత్‌లీగ్‌లో విజయం సాధిస్తా. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రోత్సాహం కూడా అవసరం. అందరి సహకారం ఉంటే గెలుపు తథ్యమని దేవిహంసిని ధీమా వ్యక్తం చేస్తోంది. 

చదవండి: చదివింది 10వ తరగతే..ముగ్గురు పిల్లలు : అట్టడుగు స్థాయినుంచి వ్యాపారవేత్తగా


 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement