
న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో ‘డ్రా’గా ముగిసిన టెస్టు సిరీస్ తర్వాత భారత జట్టు వచ్చే నెలలో ఆసియా కప్ టి20 టోర్నీలో బరిలోకి దిగనుంది. సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వేదికగా ఈ టోర్నీ జరుగుతుంది. ఇది ముగిసిన తర్వాత అక్టోబర్ 2 నుంచి వెస్టిండీస్‌తో తొలి టెస్టులో టీమిండియా తలపడుతుంది. అయితే వారం రోజుల్లోపే టెస్టు సిరీస్ ఉన్నా సరే... టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో పాటు ఓపెనర్ యశస్వి జైస్వాల్‌లను ఆసియా కప్‌కు ఎంపిక చేయాలని సెలక్టర్లు భావిస్తున్నారు.
బిజీ షెడ్యూల్ కారణంగా గత కొన్ని టి20లనుంచి గిల్, జైస్వాల్‌లకు విశ్రాంతినిచ్చారు. ఆ సమయంలో సంజు సామ్సన్, అభిõÙక్ శర్మ ఓపెనర్లుగా చెలరేగిపోయారు. అయితే తాజా ఫామ్, ఐపీఎల్‌లో ప్రదర్శనను బట్టి చూస్తే గిల్, జైస్వాల్‌లను టి20 టీమ్‌లోకి తీసుకొచ్చే ఆలోచన ఉంది. ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించిన మరో బ్యాటర్ సాయి సుదర్శన్ పేరు కూడా టీమ్ పరిశీలనలో ఉంది. సుదర్శన్ భారత్ తరఫున 3 వన్డేలు, ఏకైక టి20 మ్యాచ్ ఆడాడు.
ఈ ముగ్గురినీ తీసుకుంటే టాప్–3 కోసం ప్రత్యామ్నాయం అందుబాటులో ఉంటుందనేది సెలక్టర్ల భావన. ఆసియా కప్‌కు 17 మందితో టీమ్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంది కాబట్టి అదనపు ఆటగాళ్లను ఎంపిక చేయడంలో సమస్య రాకపోవచ్చు. ఆ తర్వాత ఆరు నెలల్లో టి20 వరల్డ్ కప్ కూడా జరగనున్న నేపథ్యంలో ‘కోర్ గ్రూప్’లో సభ్యులుగా అందరి ఆటను సెలక్టర్లు పరిశీలించే అవకాశం ఉంది. మరోవైపు బుమ్రా, సిరాజ్‌ల విషయంలో టోరీ్నకి ముందు ఫిట్‌నెస్‌ను పరిశీలించే తుది నిర్ణయం తీసుకుంటారు.