బంగారం దిగుమతిపై జ్యుయలర్లకు వెసులుబాటు

India Allows Valid Quota Holders Under India-uae Trade Pact - Sakshi

న్యూఢిల్లీ: స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం పరిధిలో యూఏఈ నుంచి రాయితీతో కూడిన కస్టమ్స్‌ డ్యూటీపై బంగారం దిగుమతి చేసుకునే జ్యుయలర్లకు కేంద్రం మరో వెసులుబాటు కల్పించింది.

ఇటువంటి వర్తకులు ఇండియా ఇంటర్నేషనల్‌ బులియన్‌ ఎక్ఛేంజ్‌ ఐఎఫ్‌ఎస్‌సీ లిమిటెడ్‌ (ఐఐబీఎక్స్‌) ద్వారా బంగారాన్ని యూఏఈ నుంచి దిగుమతి చేసుకోవచ్చంటూ డెరక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారీన్‌ ట్రేడ్‌ (డీజీఎఫ్‌టీ) నోటిఫికేషన్‌ జారీ చేసింది.

దిగుమతి బంగారాన్ని భౌతిక రూపంలోనూ పొందొచ్చని పేర్కొంది. ఐఎఫ్‌ఎస్‌సీఏ నమోదిత ఖజానాల ద్వారా భౌతిక బంగారాన్ని పొందాల్సి ఉంటుందని తెలిపింది. భారత్‌–యూఏఈ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం 2022 మే నుంచి అమల్లోకి రావడం గమనార్హం.

టారిఫ్‌ రేట్‌ కోటా (టీఆర్‌క్యూ) నిబంధనల కింద దేశీయ దిగుమతి దారులు నిర్ధేశిత పరిమాణంలో బంగారాన్ని రాయితీతో కూడిన సుంకం చెల్లించి పొందడానికి అనుమతి ఉంటుంది.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top