రజనీకాంత్‌కు గోల్డెన్‌ వీసా.. స్నేహితుడి వల్లే ఈ గౌరవం దక్కిందంటూ.. | UAE Honor To Rajinikanth With Golden Visa, Video Goes Viral | Sakshi
Sakshi News home page

Rajinikanth Golden Visa: రజనీకాంత్‌కు గోల్డెన్‌ వీసా.. స్నేహితుడి వల్లే ఈ గౌరవం దక్కిందంటూ..

Published Fri, May 24 2024 7:34 AM

UAE Honor To Rajinikanth With Golden Visa

సౌత్‌ ఇండియా స్టార్‌ హీరో రజనీకాంత్‌కు మరో గౌరవం దక్కింది. యూఏఈ ప్రభుత్వం వివిధ రంగాల్లో పేరు పొందిన వారిని సత్కరించేందుకు గోల్డెన్ వీసాను అందిస్తోంది. భారత్ నుంచి వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు యూఏఈ ఇచ్చే ఈ గోల్డెన్ వీసాను అందుకున్నారు. తాజాగా ఆ జాబితాలో రజనీకాంత్‌ చేరారు. యూఏఈ ఇచ్చే ఈ లాంగ్‌టర్మ్ వీసా 10 ఏళ్ల కాలపరిమితో ఉంటుంది.

2019లో యూఏఈ ప్రభుత్వం ఈ   వీసాల కోసం ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈ వీసాను చాలామంది భారతీయ ప్రముఖలకు యూఏఈ అందించి గౌరవించింది. ఇప్పుడు రజనీకాంత్‌ను కూడా ఆ ప్రభుత్వం గోల్డెన్‌ వీసాతో గౌరవించింది. వీసా పొందిన అనంతరం ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వేట్టైయాన్ సినిమాలో నటిస్తున్న రజనీకాంత్ వెకేషన్ కోసం దుబాయ్ వెళ్లారు. ఈ సందర్భంగా అబుదాబిలో జరిగిన ఓ కార్యక్రమంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వ సాంస్కృతిక, పర్యాటక శాఖ ఆయనకు ఈ గోల్డెన్ వీసాను అందించడం విశేషం. 

ఈ సందర్భంగా  రజనీకాంత్ తనకు గోల్డెన్ వీసా మంజూరు చేసినందుకు దుబాయ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఓ వీడియోను విడుదల చేశారు. యూఏఈ ప్రభుత్వంతో పాటు తన స్నేహితుడు లులూ గ్రూప్‌ అధినేత‌ యూసఫ్‌ అలీకి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వల్లే ఇది సాధ్యమైనట్లు రజనీ తెలిపారు. పారిశ్రామికవేత్తలు, వ్యవస్థాపకులు, శాస్త్రవేత్తలు, స్పోర్ట్స్ రంగంలోని నిపుణులు, నటులు వంటి వారికి గోల్డెన్ వీసా ఇస్తారు.  10 ఏళ్ల కాలపరిమితితో యూఏఈ ఈ ప్రత్యేక వీసాలను అందిస్తోంది. ఈ వీసా పొందిని వారందరూ  పూర్తి ఓనర్‌షిప్‌తో ఆ దేశంలో సొంతంగా వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు.

ఇప్పటికే గోల్డెన్‌ వీసా పొందిన ప్రముఖులు
భారత్ నుంచి ఇప్పటివరకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు యూఏఈ ఇచ్చే ఈ గోల్డెన్ వీసాను అందుకున్న జాబితా ఇదే..  షారుక్‌ ఖాన్‌, అల్లు అర్జున్‌, పృథ్వీరాజ్, దుల్కర్‌ సల్మాన్‌, సంజయ్ దత్,ఊర్వశి రౌతేలా, త్రిష, అమలాపాల్, మోహన్‌లాల్‌, మమ్ముట్టి,మీరా జాస్మిన్‌, టొవినో థామస్‌,విజయ్ సేతుపతి,కమల్ హాసన్‌, విక్రమ్, యువన్ శంకర్ రాజా,టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, సునీల్ షెట్టి, బోనీ కపూర్ ఫ్యామిలీ ఈ జాబితాలో ఉన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement