యూఏఈ వేదిక‌గా మ‌హిళ‌ల టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌..!? | Zimbabwe joins UAE suit, keen to host Women's T20 World Cup | Sakshi
Sakshi News home page

యూఏఈ వేదిక‌గా మ‌హిళ‌ల టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌..!?

Aug 17 2024 2:59 PM | Updated on Aug 17 2024 3:04 PM

Zimbabwe joins UAE suit, keen to host Women's T20 World Cup

బంగ్లాదేశ్‌లో వచ్చే అక్టోబరులో నిర్వహించాల్సిన మహిళల టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌పై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. బంగ్లాలో నెల‌కొన్న రాజకీయ అనిశ్చితుల దృష్ట్యా  పొట్టి ప్రపంచకప్‌ వేదిక మారే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి.

ఇప్పటికే ఈ టోర్నీ నిర్వహణ కోసం ప్ర‌త్నామ్నాయ అవ‌కాశాల‌ను ఐసీసీ ప‌రిశీలిస్తోంది. అందులో భాగం‍గా భారత్‌లో నిర్వహించాల్సిందిగా బీసీసీఐని ఐసీసీ అభ్యర్ధించింది. కానీ అందుకు బీసీసీఐ నో చెప్పింది.  ఈ టోర్నీలో జరిగే ఆక్టోబర్‌లో భారత్‌లో వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ఐసీసీ ఆఫర్‌ను బీసీసీఐ తిరస్కరించింది.

అయితే ఈ మెగా ఈవెంట్ నిర్వహణకు యూఏఈ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. త​మ నిర్ణయాన్ని ఇప్పటికే ఐసీసీకి యూఏఈ క్రికెట్ బోర్డు తెలియజేసినట్లు సమాచారం. మరోవైపు జింబాబ్వే క్రికెట్ కూడా ఈ టోర్నీని నిర్వహించేందుకు సిద్దంగా ఉన్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. 

ఇటీవల కాలంలో రెండు వన్డే ప్రపంచకప్ క్వాలిఫైయర్ మ్యాచ్‌లను జింబాబ్వే విజయవంతంగా నిర్వహించింది. ఈ క్రమంలో వరల్డ్‌కప్ వంటి మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమివ్వాలని జింబాబ్వే యోచిస్తోంది.

కాగా ఆగస్టు 20 జరగనున్న బోర్డు డైరెక్టర్ల సమావేశంలో ఈ విషయంపై ఒక క్లారిటీ రానుంది. అయితే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ నిర్ణయాన్ని వెల్లడించడానికి కొంత సమయం కావాలని ఐసీసీని అడిగినట్లు వినికిడి. ఇక షెడ్యూల్‌ ప్రకారం.. అక్టోబర్‌ 3 నుంచి 20వ తేదీ వరకు మహిళల టీ20 ప్రపంచకప్‌ జరగాల్సి ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement