వింత డ్యాన్స్‌తో ట్రంప్‌కు‌ స్వాగతం.. వీడియో వైరల్‌ | Donald Trump Welcome Abu Dhabi With Al-Ayyala Performance | Sakshi
Sakshi News home page

వింత డ్యాన్స్‌తో ట్రంప్‌కు‌ స్వాగతం.. వీడియో వైరల్‌

May 16 2025 12:57 PM | Updated on May 16 2025 1:46 PM

Donald Trump Welcome Abu Dhabi With Al-Ayyala Performance

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పశ్చిమ దేశాల పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)కు చేరుకున్నారు. ట్రంప్‌కు యూఏఈలో ఘన స్వాగతం లభించింది. ఆయనకు అక్కడి సంప్రదాయ నృత్యం అల్‌ అయ్యాలా (Al-Ayyala)తో స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదేం డ్యాన్స్‌ అంటూ నెటిజన్లు సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

వివరాల ప్రకారం.. అధ్యక్షుడు ట్రంప్‌ యూఏఈ (UAE) చేరుకున్నాక అధ్యక్షుడు మహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ స్వాగతం పలికారు. అనంతరం, ఇద్దరు నేతలు కలిసి అధ్యక్ష భవనం ఖషర్‌ అల్‌-వాటన్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలోనే పలువురు బాలికలు జుట్టు విరబోసుకొని సంప్రదాయ సంగీతానికి అనుగుణంగా తలలు ఊపుతూ ట్రంప్‌నకు స్వాగతం పలికారు. పక్కనే కొందరు డబ్బులు వాయిస్తుండగా ఇద్దరు నేతలు ముందుకు కదిలారు. వారి డ్యాన్స్‌ చూసిన ట్రంప్‌.. ఒక్కసారిగా షాకయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇదిలా ఉండగా, యునెస్కో (UNESCO)ప్రకారం.. అల్‌- అయ్యాలా అనేది యూఏఈ, ఒమన్‌లలో ప్రసిద్ధి చెందిన సంప్రదాయ నృత్యం. సంప్రదాయ దుస్తులు ధరించిన బాలికలు వారి పొడవాటి జుట్టును విరబోసుకొని.. సంగీతానికి అనుగుణంగా తలలను ఊపుతుంటారు. వేడుకలు, వివాహాల సమయాల్లో అల్‌- అయ్యాలాను ఎక్కువగా ప్రదర్శిస్తుంటారు. వయసు, లింగం, సామాజిక బేధం వంటి తేడాలు లేకుండా అందరినీ ఒకచోట చేర్చేదిగా దీన్ని భావిస్తారు. వీరంతా తలలు ఊపుకుంటూ డ్యాన్స్‌ చేసినట్టుగా ఊగిపోతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement