వైరల్‌ : నేను వెళ్లనంటూ ట్రంప్‌ మారాం

Viral Video On Trump Hesitate Leave Play School Relevant To White House - Sakshi

న్యూయార్క్‌ : ఉత్కంఠంగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికకు శనివారంతో తెర పడింది. డెమోక్రాట్‌ అభ్యర్థి జో బైడెన్‌ అమెరికా 46వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 284 ఎలక్టోరల్‌ ఓట్లను సాధించి స్పష్టమైన మెజారిటీ సాధించిన బైడెన్‌ త్వరలోనే వైట్‌హౌస్‌లోకి అడుగుపెట్టనున్నాడు. మరోవైపు ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 214 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించి పరాజయాన్ని మూటగట్టుకున్నాడు. (చదవండి : అతని పేరు చెప్పనందుకు సంతోషంగా ఉంది)

తుది ఫలితాలు రాకముందు వరకు ట్రంప్‌.. డెమోక్రాట్‌ అభ్యర్థులు ఎన్నికల్లో రిగ్గింగ్, మోసాలకు పాల్పడ్డారంటూ అదేపనిగా ఫేస్‌బుక్‌తో పాటు ట్విటర్‌ వేదికగా కామెంట్లు చేశారు. కానీ ఫలితాలు ఒక్కసారిగా ట్రంప్‌కు వ్యతిరేకంగా రావడంతో ఒత్తిడిని జయించేందుకు తన గోల్ఫ్‌క్లబ్‌కి వెళ్లి గోల్‌ ఆడుతూ కనిపించారు.రెండోసారి వైట్‌హౌస్‌లో ఉండే అర్హత కోల్పోయిన ట్రంప్‌పై నెటిజన్లు సోషల్‌మీడియాలో మీమ్స్‌, వీడియోలతో హల్‌చల్‌ చేశారు. జిమ్‌ పికార్డ్‌ అనే వ్యక్తి తన ట్విటర్‌లో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది.

కాగా ఇంతకముందు అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌లో జో బైడెన్‌‌ను కెప్టెన్‌ అమెరికాగా, ట్రంప్‌ను థానోస్‌గా చూపించారు. తాజాగా బైడెన్‌ ఎన్నికతో ట్రంప్‌ వైట్‌హౌస్‌ను ఖాళీ చేయాల్సి ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ఒక పేరడీ వీడియో రూపొందించారు.ఆ వీడియోలో ట్రంప్‌ స్కూల్‌లో ప్లేటైమ్‌లో ఆడుకుంటున్నట్లుగా చూపించారు. ఇంతలో జో బైడెన్‌ అక్కడికి వచ్చి ఇక నీ టైం అయిపోయింది వెళ్లమని అంటాడు. దీంతో ట్రంప్‌ నేను వెళ్లనని చెబుతూ కిందపడి కొట్టుకుంటూ మారాం చేస్తాడు. ఆ తర్వాత బైడెన్‌ ట్రంప్‌ను బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నంలో వీడియో ముగుస్తుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లంతా ఇప్పటి పరిస్థితులకు సరిగ్గా సరిపోయింది అంటూ నవ్వుకుంటున్నారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top