అంతా ఫేక్‌.. నమ్మొద్దు! | UAE govt debunked recent claims about nomination based Golden Visa | Sakshi
Sakshi News home page

అంతా ఫేక్‌.. నమ్మొద్దు!

Jul 9 2025 2:20 PM | Updated on Jul 9 2025 3:34 PM

UAE govt debunked recent claims about nomination based Golden Visa

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) ప్రభుత్వం కొత్త రకం గోల్డెన్‌ వీసా పథకాన్ని ప్రారంభించినట్లు వచ్చిన వార్తలపై అక్కడి ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. కొన్ని షరతులతో నామినేషన్‌ విధానంలో ఈ వీసాను త్వరలో జారీ చేయనున్నట్లు వచ్చిన కథనాల్లో వాస్తవం లేదని యూఏఈ ప్రభుత్వం అధికారికంగా వివరణ ఇచ్చింది. ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్‌, కస్టమ్స్ అండ్ పోర్ట్ సెక్యూరిటీ (ఐసీపీ) విభాగాలు ఈ కథనాలు పూర్తిగా ఫేక్ అని కొట్టిపారేశాయి.

లక్ష అరబ్‌ ఎమిరేట్స్‌ దినార్లు (సుమారు రూ.23.3 లక్షలు) ఫీజు చెల్లిస్తే జీవితకాలం వర్తించే వీసా అందజేస్తున్నట్లు రాయద్‌ గ్రూప్‌ తెలిపింది. దాంతో చాలా అంతర్జాతీయ వార్తా సంస్థలు ఈమేరకు కథనాలు ప్రచురించాయి. ఇవికాస్తా వైరల్‌గా మారడంతో దుబాయ్‌ ప్రభుత్వమే రంగంలోకి దిగి స్పష్టతనిచ్చింది. ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్‌, కస్టమ్స్ అండ్ పోర్ట్ సెక్యూరిటీ (ఐసీపీ) విభాగాలు ఇలా వస్తున్న కథనాలను నమ్మకూడదని తేల్చి చెప్పాయి.

ఇదీ చదవండి: యాపిల్‌ కొత్త సీఓఓ మనోడే..

‘అన్ని గోల్డెన్ వీసా అప్లికేషన్‌లు అధికారిక యూఏఐ ప్రభుత్వ మార్గాలు, స్పష్టమైన విధానాల ద్వారానే ప్రాసెస్‌ అవ్వాలి. దరఖాస్తుదారులను నమ్మించేలా, వారి అప్లికేషన్లను ప్రాసెస్ చేయడానికి లేదా నామినేట్ చేయడానికి ఏ బాహ్య కన్సల్టెన్సీకి లేదా ఏజెన్సీకి అధికారం లేదు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ, ప్రజల ఆకాంక్షలను దుర్వినియోగం చేసే సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని తెలిపింది. ఖచ్చితమైన వివరాల కోసం దరఖాస్తుదారులు ఐసీపీ అధికారిక వెబ్‌సైట్‌ లేదా 600 522 222 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని కోరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement