
ప్రపంచ దిగ్గజ కంపెనీ యాపిల్ కొత్తగా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా భారత సంతతికి చెందిన సబీహ్ ఖాన్‌ను నియమించింది. ఇప్పటి వరకు ఈ స్థానంలో జెఫ్ విలియమ్స్ సేవలందించారు. 2015 నుంచి సీఓఓ పదవిలో ఉన్న జెఫ్ విలియమ్స్ ఇకపై కంపెనీ సీఈఓ టిమ్ కుక్‌కు రిపోర్ట్ చేస్తూ యాపిల్ వాచ్, డిజైన్ బృందాలను పర్యవేక్షించనున్నారు. ఈ ఏడాది చివర్లో విలియమ్స్ పదవీ విరమణ చేసిన తర్వాత డిజైన్ బృందం నేరుగా టిమ్‌కు నివేదిస్తుందని యాపిల్ పేర్కొంది.
ఎవరీ సబీహ్ ఖాన్..
యాపిల్ సంస్థలో 30 ఏళ్లుగా పనిచేస్తూ, ప్రస్తుతం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆపరేషన్స్‌గా సేవలందిస్తున్న సబీహ్ ఖాన్ ఈ నెలాఖరులో అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో 1966లో జన్మించిన ఖాన్ చదువుకునే రోజుల్లోనే సింగపూర్‌కు మకాం మార్చారు. టఫ్ట్స్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్‌లో డ్యూయల్ బ్యాచిలర్ డిగ్రీలు పొందారు. రెన్సెలీర్ పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూట్ (ఆర్‌పీఐ) నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ పట్టా సాధించారు.
Many congratulations to Sabih Khan on being elevated as the COO of Apple
I had the pleasure of meeting and interacting with Sabih a few years ago when he was leading Global supply chain operations for Apple
Onwards and upwards my friend 👏 pic.twitter.com/TbsYffwLJv— KTR (@KTRBRS) July 9, 2025
ఇదీ చదవండి: కుబేరులకు దేశాలు రెడ్‌కార్పెట్
జీఈ ప్లాస్టిక్స్‌లో తన వృత్తి జీవితాన్ని ప్రారంభించిన తరువాత ఖాన్ 1995లో యాపిల్‌లో చేరారు. అప్పటి నుంచి అతను గ్లోబల్ సప్లై చైన్, సప్లయర్ రెస్పాన్సిబిలిటీ ప్రోగ్రామ్స్, ఆపరేషనల్ స్ట్రాటజీని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. యాపిల్ గ్లోబల్ స్ట్రాటజీలో కీలక మార్కెట్‌గా భారత్ ఎదుగుతున్న నేపథ్యంలో ఖాన్ ఈ పదవిని చేపట్టడం గమనార్హం. ఖాన్ భారాస నేత కేటీఆర్ స్నేహితుడు కావడంతో తన ఎక్స్ ఖాతాలో శుభాకాంక్షలు తెలిపారు.