
ప్రముఖ స్మార్ట్‌ఫోన్స్ సంస్థ వివో తమ 30వ వార్షికోత్సవం సందర్భంగా మిక్స్‌డ్ రియాల్టీ హెడ్‌సెట్ 'విజన్ డిస్కవరీ' ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది. దీంతో ఇటు స్మార్ట్‌ఫోన్స్, అటు ఎంఆర్ ప్రోడక్టుల విభాగాల్లో మొదటిసారిగా మిక్సిడ్ రియాలిటీ ఉత్పత్తిని ప్రవేశపెట్టిన తొలి చైనా కంపెనీగా నిలిచింది.
వివో మిక్స్‌డ్ రియల్టీ హెడ్‌సెట్ బరువు 300 గ్రాములు, మందం 40 మిమీ మాత్రమే. కాబట్టి ఇప్పటివరకు మార్కెట్లో ఉన్న ఇతర ఎంఆర్ ఉత్పత్తితో పోలిస్తే ఇది 26 శాతం చిన్నగాను, సౌకర్యవంతంగాను ఉంటుంది. ఈ హెడ్‌సెట్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ఎక్స్‌ఆర్2ప్లస్ జెన్ 21 ప్లాట్‌ఫామ్ మీద నిర్మితమైంది. ఇది రెండున్నర రెట్లు అధికంగా జీపీయూ సామర్థ్యాలు, ఎనిమిది రెట్లు అధికంగా ఏఐ సామర్థ్యాలను పొందింది.