చైనా ప్రొడక్ట్‌లపై యాంటీ–డంపింగ్‌ సుంకం | India imposed anti dumping duties on six Chinese products | Sakshi
Sakshi News home page

చైనా ప్రొడక్ట్‌లపై యాంటీ–డంపింగ్‌ సుంకం

Jun 26 2025 9:22 PM | Updated on Jun 26 2025 9:22 PM

India imposed anti dumping duties on six Chinese products

వెల్లువెత్తే చౌక దిగుమతుల నుంచి దేశీ తయారీ సంస్థల ప్రయోజనాలను కాపాడే దిశగా ఈ నెలలో ఇప్పటివరకు ఆరు చైనా ఉత్పత్తులపై కేంద్రం యాంటీ–డంపింగ్‌ సుంకం విధించింది. పీఈడీఏ, ఎసిటోనైట్రైల్‌ (ఫార్మా రంగంలో ఉపయోగిస్తారు), విటమిన్‌–ఏ పామిటేట్, డెకోర్‌ పేపర్‌ మొదలైనవి వీటిలో ఉన్నాయి.

పరిశ్రమల్లో ఉపయోగించే ఈ ముడిసరుకులపై అయిదేళ్ల పాటు సుంకాలు ఉంటాయని వేర్వేరు నోటిఫికేషన్లలో కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డ్‌ తెలిపింది. వాణిజ్య శాఖలో భాగమైన డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ట్రేడ్‌ రెమెడీస్‌ (డీజీటీఆర్‌) సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. దిగుమతి సుంకాలు ఉత్పత్తిని బట్టి కేజీకి 20.87 డాలర్ల నుంచి టన్నుకు 2,017.9 డాలర్ల వరకు ఉంటాయి.

ఇదీ చదవండి: మీ వయసు 30 లోపా? తప్పక తెలియాల్సినవి..

గత ఆర్థిక సంవత్సరంలో చైనాతో భారత్‌ వాణిజ్య లోటు 99.2 బిలియన్‌ డాలర్లకు చేరింది. చైనాకు ఎగుమతులు 14.5 శాతం క్షీణించి 14.25 బిలియన్‌ డాలర్లకు పరిమితం కాగా, దిగుమతులు 11.52 శాతం పెరిగి 113.45 బిలియన్‌ డాలర్లకు ఎగిశాయి.

Advertisement
 
Advertisement
Advertisement