
వివో కంపెనీ వీ60 పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ఇందులో 6.77 అంగుళాల ప్రీమియం క్వాడ్ కర్వ్‌డ్ డిస్‌ప్లే, అల్ట్రా కాంపాక్ట్ కెమెరా మాడ్యూల్ ఉన్నాయి. 50 మెగాపిక్సల్ టెలీఫొటో, స్నాప్‌డ్రాగన్ 7జెన్4 చిప్‌సెట్, ఐపీ రేటింగ్ (ఐపీ68, 69), స్కాట్ డ్రాప్ రెసిస్టెన్స్ గ్లాస్‌తో వస్తుంది. ధరల శ్రేణి రూ.36,999 నుంచ రూ.45,999 మధ్య ఉంటుంది.
ఈ నెల 19వ తేదీ నుంచి వివో వెబ్‌సైట్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, అన్ని రిటైల్ స్టోర్లలో లభిస్తుందని కంపెనీ ప్రకటించింది. యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డుల ద్వారా చెల్లింపులు చేస్తే 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఆరు నెలల నోకాస్ట్ ఈఎంఐ, ఏడాది అదనపు వారంటీని కంపెనీ ఆఫర్ చేస్తోంది. వివో టీడబ్ల్యూఎస్ 3ఈ సెట్‌ను రూ.1,499కే సొంతం చేసుకోవచ్చని ప్రకటించింది.
ఇదీ చదవండి: రూపాయి 79 ఏళ్ల ప్రస్థానం
పోకో నుంచి ఎం7 ప్లస్ 5జీ స్మార్ట్‌ఫోన్
కన్జూమర్ టెక్నాలజీ బ్రాండ్ పోకో తాజాగా ఎం7 ప్లస్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ప్రారంభ ఆఫర్ కింద దీని ధర రూ.12,999గా ఉంటుంది. ఇందులో 7000 ఎంఏహెచ్ సిలికాన్ కార్బన్ బ్యాటరీ, 6.9 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 3 చిప్,50 ఎంపీ ఏఐ రియర్ కెమెరా తదితర ఫీచర్లు ఉన్నాయి. 2 ఓఎస్ జనరేషన్స్, 4 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఆగస్టు 19 నుంచి సేల్ ప్రారంభమవుతుందని పోకో వివరించింది.