శాంసంగ్‌ గెలాక్సీ ఎక్స్‌ఆర్‌ హెడ్‌సెట్‌ విడుదల | Samsung working on AI glasses with Google following Galaxy XR headset debut | Sakshi
Sakshi News home page

శాంసంగ్‌ గెలాక్సీ ఎక్స్‌ఆర్‌ హెడ్‌సెట్‌ విడుదల

Oct 22 2025 5:32 PM | Updated on Oct 22 2025 5:49 PM

Samsung working on AI glasses with Google following Galaxy XR headset debut

శామ్ సంగ్ తాజాగా “వరల్డ్ వైడ్ ఓపెన్” ఈవెంట్‌లో తన కొత్త ఎక్స్‌ఆర్‌ (XR-ఎక్స్‌టెండెడ్ రియాలిటీ) వ్యూహాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా, గెలాక్సీ ఎక్స్‌ఆర్‌ హెడ్‌సెట్‌తో పాటు, వైర్డ్, వైర్‌లెస్ ఎక్స్‌ఆర్‌ గ్లాసెస్, ఏఐ గ్లాసెస్ అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించింది. గూగుల్‌తో భాగస్వామ్యంలో రూపొందిస్తున్న ఆండ్రాయిడ్‌ ఎక్స్‌ఆర్‌ ప్లాట్‌ఫామ్‌ను ఈ పరికరాలు ఉపయోగించనున్నాయి.

డిస్‌ప్లే ఉన్న హెడ్‌సెట్‌ల నుండి డిస్‌ప్లే రహిత ఏఐ గ్లాసెస్ వరకు ఎక్స్‌ఆర్‌ పరికరాల పూర్తి సిరీస్‌ను ఈ ఈవెంట్‌లో శాంసంగ్‌ వివరించింది. శాంసంగ్, జెంటిల్ మాన్‌స్టర్, వార్బీ పార్కర్ వంటి బ్రాండ్లతో కలిసి గ్లాసెస్ డిజైన్‌లో పనిచేస్తోంది.

ఏఐ గ్లాసెస్ ప్రత్యేకంగా ఓక్లే మెటా గ్లాసెస్‌కు ప్రత్యర్థిగా ఉండనున్నాయి. వీటిలో డిస్‌ప్లే ఉండదు కానీ, గూగుల్‌ జెమినీ ఏఐ (Google Gemini AI) సాయంతో మెసేజింగ్, నావిగేషన్, అనువాదం వంటి స్మార్ట్ ఫీచర్లను అందిస్తాయి. గూగుల్ ఇప్పటికే ఈ తరహా గ్లాసెస్‌ను డెమోలో ప్రదర్శించింది.

శాంసంగ్ ఎక్స్‌ గ్లాసెస్ (కోడ్‌నేమ్: HEN) క్వాల్కమ్ XR2+ Gen 2 చిప్‌సెట్‌ను ఉపయోగించి ఆండ్రాయిడ్‌ ఎక్స్‌ఆర్‌ ప్లాట్‌ఫారమ్‌పై నడుస్తాయి. ఇందులో ఇంటిగ్రేటెడ్ లెన్స్ డిస్‌ప్లే, ఆడియో స్పీకర్లు, కెమెరాలు, చేతి సంజ్ఞల ఆధారంగా నియంత్రణలు ఉంటాయని అంచనా.

గెలాక్సీ ఎక్స్‌ఆర్‌ హెడ్‌సెట్ స్పెసిఫికేషన్లు
డిస్‌ప్లే: మైక్రో-OLED, 3,552×3,840 రిజల్యూషన్, 60–90Hz
చిప్‌సెట్: క్వాల్కమ్ XR2+ Gen 2
ర్యామ్‌: 16GB స్టోరేజ్: 256GB
ఓఎస్‌: ఆండ్రాయిడ్‌ ఎక్స్‌ఆర్‌
కెమెరా: 6.5MP
సెన్సార్లు: నాలుగు ఐ-ట్రాకింగ్, రెండు పాస్-త్రూ, ఐదు ఐఎంయూ, డెప్త్‌, ఫ్లిక్కర్‌ ఒక్కోటి ఉంటాయి.
బ్యాటరీ: 2 గంటలు సాధారణ వినియోగం, 2.5 గంటలు వీడియో ప్లేబ్యాక్
కనెక్టివిటీ: వైఫై7, బ్లూటూత్‌ 5.4
బరువు: హెడ్‌సెట్ - 545 గ్రాములు, బ్యాటరీ - 302 గ్రాములు

శామ్ సంగ్ గెలాక్సీ ఎక్స్‌ఆర్‌ హెడ్‌సెట్ యాపిల్ విజన్‌ ప్రోకి (Apple Vision Pro), రాబోయే ఎక్స్‌ఆర్‌ గ్లాసెస్ మెటా రేబాన్‌ గ్లాసెస్‌కి పోటీగా నిలవనున్నాయి. ఏఐ గ్లాసెస్ 2025లో విస్తృత వినియోగానికి సిద్ధమయ్యే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement