
భారతదేశంలో లార్జెస్ట్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన శామ్‌సంగ్.. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ ప్లాజాలోని దాని ఫ్లాగ్‌షిప్ స్టోర్‌లో "ఏఐ హోమ్: ఫ్యూచర్ లివింగ్, నౌ" కోసం తన విజన్‌ను ఆవిష్కరించింది. టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో సంస్థ దీనిని పరిచయం చేసింది.
ఒకసారి ఊహించుకోండి.. మీరు ఇంటికి వచ్చేసరికి లైట్లు ఆన్ అవుతాయి. వీ మీకు ఇష్టమైన షోను క్యూలో ఉంచుతుంది. ఏసీ మీ నిద్రకు కావలసిన టెంపరేచర్ అందిస్తుంది. ఇలా ఇంటిపనులన్నీ ఆటోమేటిక్‌గా జరిగిపోతే ఎంతబాగుంటుంది. ఇవన్నీ సాధ్యం చేయడానికే.. శామ్‌సంగ్ ఏఐ హోమ్: ఫ్యూచర్ లివింగ్, నౌ తీసుకొస్తోంది.
శామ్‌సంగ్ గెలాక్సీ ఏఐ, విజన్ ఏఐ, బెస్పోక్ ఏఐ వంటి వాటి ద్వారా.. ప్రజల దైనందిన జీవితాల్లోకి టెక్నాలజీని అనువదించాలనుకుంటున్నాము. ఇది రోజువారీ జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా, సమర్థవంతంగా, ఆరోగ్యంగా, సురక్షితంగా మారుస్తుంది. భారతదేశం ఈ ప్రయాణంలో కేంద్రంగా ఉంది. ఇక్కడ నుంచే ప్రపంచానికి పరిచయం చేస్తామని.. శామ్‌సంగ్ సౌత్‌వెస్ట్ ఆసియా అధ్యక్షుడు, సీఈఓ జేబీ పార్క్ అన్నారు.