breaking news
XR
-
యాపిల్‌కి పోటీ.. శాంసంగ్ గెలాక్సీ ఎక్స్ఆర్ హెడ్సెట్ విడుదల
శామ్ సంగ్ తాజాగా “వరల్డ్ వైడ్ ఓపెన్” ఈవెంట్లో తన కొత్త ఎక్స్ఆర్ (XR-ఎక్స్టెండెడ్ రియాలిటీ) వ్యూహాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా, గెలాక్సీ ఎక్స్ఆర్ హెడ్‌సెట్‌తో పాటు, వైర్డ్, వైర్లెస్ ఎక్స్ఆర్ గ్లాసెస్, ఏఐ గ్లాసెస్ అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించింది. గూగుల్‌తో భాగస్వామ్యంలో రూపొందిస్తున్న ఆండ్రాయిడ్ ఎక్స్ఆర్ ప్లాట్‌ఫామ్‌ను ఈ పరికరాలు ఉపయోగించనున్నాయి.డిస్ప్లే ఉన్న హెడ్సెట్ల నుండి డిస్ప్లే రహిత ఏఐ గ్లాసెస్ వరకు ఎక్స్ఆర్ పరికరాల పూర్తి సిరీస్‌ను ఈ ఈవెంట్లో శాంసంగ్ వివరించింది. శాంసంగ్, జెంటిల్ మాన్స్టర్, వార్బీ పార్కర్ వంటి బ్రాండ్లతో కలిసి గ్లాసెస్ డిజైన్‌లో పనిచేస్తోంది.ఏఐ గ్లాసెస్ ప్రత్యేకంగా ఓక్లే మెటా గ్లాసెస్‌కు ప్రత్యర్థిగా ఉండనున్నాయి. వీటిలో డిస్ప్లే ఉండదు కానీ, గూగుల్ జెమినీ ఏఐ (Google Gemini AI) సాయంతో మెసేజింగ్, నావిగేషన్, అనువాదం వంటి స్మార్ట్ ఫీచర్లను అందిస్తాయి. గూగుల్ ఇప్పటికే ఈ తరహా గ్లాసెస్‌ను డెమోలో ప్రదర్శించింది.శాంసంగ్ ఎక్స్ గ్లాసెస్ (కోడ్‌నేమ్: HEN) క్వాల్కమ్ XR2+ Gen 2 చిప్‌సెట్‌ను ఉపయోగించి ఆండ్రాయిడ్ ఎక్స్ఆర్ ప్లాట్‌ఫారమ్‌పై నడుస్తాయి. ఇందులో ఇంటిగ్రేటెడ్ లెన్స్ డిస్ప్లే, ఆడియో స్పీకర్లు, కెమెరాలు, చేతి సంజ్ఞల ఆధారంగా నియంత్రణలు ఉంటాయని అంచనా.గెలాక్సీ ఎక్స్ఆర్ హెడ్సెట్ స్పెసిఫికేషన్లుడిస్ప్లే: మైక్రో-OLED, 3,552×3,840 రిజల్యూషన్, 60–90Hzచిప్సెట్: క్వాల్కమ్ XR2+ Gen 2ర్యామ్: 16GB స్టోరేజ్: 256GBఓఎస్: ఆండ్రాయిడ్ ఎక్స్ఆర్కెమెరా: 6.5MPసెన్సార్లు: నాలుగు ఐ-ట్రాకింగ్, రెండు పాస్-త్రూ, ఐదు ఐఎంయూ, డెప్త్, ఫ్లిక్కర్ ఒక్కోటి ఉంటాయి.బ్యాటరీ: 2 గంటలు సాధారణ వినియోగం, 2.5 గంటలు వీడియో ప్లేబ్యాక్కనెక్టివిటీ: వైఫై7, బ్లూటూత్ 5.4బరువు: హెడ్సెట్ - 545 గ్రాములు, బ్యాటరీ - 302 గ్రాములుశామ్ సంగ్ గెలాక్సీ ఎక్స్ఆర్ హెడ్సెట్ యాపిల్ విజన్ ప్రోకి (Apple Vision Pro), రాబోయే ఎక్స్ఆర్ గ్లాసెస్ మెటా రేబాన్ గ్లాసెస్‌కి పోటీగా నిలవనున్నాయి. ఏఐ గ్లాసెస్ 2025లో విస్తృత వినియోగానికి సిద్ధమయ్యే అవకాశం ఉంది. -
ఆ సీరియల్‌కి ఆమే ప్లస్!
పదే పదే కొడితే పిల్లి కూడా పులిలా మారి ఎదురుదాడి చేస్తుందంటారు. మరి అభిమానం ఉన్న ఆడపిల్ల మనసును గాయపరిస్తే ఆమె మాత్రం ఉగ్రరూపం దాల్చదా? అన్యాయం చేసినవాడికి బుద్ధి చెప్పదా? దుర్గ అదే చేస్తోంది... ‘ఏక్ హసీనా థీ’లో! స్టార్ ప్లస్‌లో కొద్ది వారాల క్రితమే మొదలయ్యిందీ సీరియల్. మొదటి ఎపిసోడ్ నుంచీ ఉత్కంఠ భరితంగానే ఉంది. దుర్గా ఠాకూర్ చాలా అందమైన అమ్మాయి. ఆమె గాజు కళ్లలో మెరుపులే కాదు... ఎవరికీ అర్థం కాని భావాలు కూడా ఉంటాయి. ఆమె నవ్వులో తళుకులే కాదు... ఎవరూ చదవలేని రహస్యాలు దాగివుంటాయి. ఓ ధనిక కుటుంబాన్ని దెబ్బ తీయడానికి ఎత్తుకు పై ఎత్తులు వేస్తుంది. ఓ యువకుడిని నాశనం చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తూ ఉంటుంది. అసలింతకీ ఆమె జీవితంలో ఏం జరిగింది? ఎందుకు అంతగా పగబట్టింది? అన్న విషయాలను కొద్దికొద్దిగా రివీల్ చేస్తూ అద్భుతంగా తెరకెక్కించారు సీరియల్‌ని. ఈ సీరియల్ మొత్తం క్రెడిట్ దుర్గగా నటించిన సంజీదా షేక్‌కి ఇచ్చేయవచ్చు. నాలుగైదు సినిమాలు, పదికి పైగా సీరియళ్లు చేసిన ఆమె దుర్గ పాత్రను అవలీలగా చేస్తోంది. అద్భుతంగా పోషిస్తోంది. తన అందానికి అభినయాన్ని జోడించి అదరగొట్టేస్తోంది. ఆమే ఈ సీరియల్‌కి పెద్ద ప్లస్! రవీందర్ కిచెన్‌లో మన వంటలు! వంటల షోల పట్ల మహిళల ఆసక్తి ఏపాటిదో చెప్పాల్సిన పని లేదు. కొత్త వంటకాలు నేర్చుకోవడానికి పెన్నూ, పేపరూ పట్టుకుని టీవీ ముందు హాజరైపోతారు. అయితే ఏ ప్రాంతం వారికి ఆ ప్రాంతం వంటలు నేర్చుకోవాలన్న ఆసక్తే ఉంటుంది. అందుకే టీఎల్సీ లాంటి చానెళ్లు మన వారిని పెద్దగా అలరించలేవు. ఆ లోటును తీర్చడానికి నడుం కట్టింది... యూకేకి చెందిన రవీందర్ భోగల్. రవీందర్ మూలాలు భారతదేశంలోనే ఉన్నాయి. ప్రతిరోజూ రాత్రి పది గంటలకు టీఎల్సీలో ప్రసారమయ్యే ‘రవీందర్స్ కిచెన్’ షోలో... అన్ని దేశాల వంటలతో పాటు మన వంటలనూ కూడా చేసి చూపిస్తుంది. పాత తరహా వంటలకు కొత్త రుచులను అద్దడంలో రవీందర్ మహా నేర్పరి. గతంలో 136 దేశాల వంటకాల గురించి ఆమె రాసిన ‘కుక్ ఇన్ బూట్స్’ పుస్తకం ప్రపంచ ఉత్తమ వంటల పుస్తకంగా అవార్డునందుకుంది! పేదపిల్ల ప్రేమ పోరాటం! ఒక ఊరిలో ఓ జమిందారు. మనుషుల జీవితాలతోటి, అమ్మాయిల తనువుల తోటి ఆడుకోవడం ఇతగాడికి మహా సరదా. ఇలాంటి వాడి వలలో చిక్కుతుంది హీరోయిన్. ఓ పేద రైతు కూతురైన ఈమెను లొంగదీసుకోవడానికి పన్నాగాలు పన్నుతాడు జమిందారు. అతడినామె ఎలా ఎదుర్కొంది, మృగంలాంటి వాడిని మనిషిగా ఎలా మారుస్తుంది? హిందీలో ‘బైరీ పియా’గా అలరించిన ఈ సీరియల్‌ని జెమినీవారు ‘నువ్వే కావాలి’గా తీసుకొచ్చారు. పేదపిల్లగా సుప్రియ జాలిగొలిపే నటన, క్రూరుడైన జమిందారుగా శరద్ హావభావాలు ప్రేక్షకుడిని కట్టి పడేస్తున్నాయి!


