
న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్‌ఏఐ ఈ ఏడాది భారత్‌లో తొలి కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. న్యూఢిల్లీలో దీన్ని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. ఇందుకోసం ఇప్పటికే స్థానికంగా నియామకాలు కూడా ప్రారంభించినట్లు వివరించింది. చాట్‌జీపీటీకి అమెరికా తర్వాత భారత్ రెండో అతి పెద్ద మార్కెట్‌గా ఉన్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.
భారత్‌లో కార్యాలయం తెరవడం వల్ల ఇక్కడి యూజర్లకు మరింత మెరుగైన సరీ్వసులు అందించేందుకు వీలవుతుందని ఓపెన్‌ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మన్ తెలిపారు. స్థానిక భాగస్వాములు, ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు, డెవలపర్లు, విద్యా సంస్థలతో కలిసి పని చేయడంపై స్థానిక సిబ్బంది దృష్టి పెడతారని వివరించారు.