breaking news
UAE citizens
-
అంతా ఫేక్.. నమ్మొద్దు!
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ప్రభుత్వం కొత్త రకం గోల్డెన్ వీసా పథకాన్ని ప్రారంభించినట్లు వచ్చిన వార్తలపై అక్కడి ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. కొన్ని షరతులతో నామినేషన్ విధానంలో ఈ వీసాను త్వరలో జారీ చేయనున్నట్లు వచ్చిన కథనాల్లో వాస్తవం లేదని యూఏఈ ప్రభుత్వం అధికారికంగా వివరణ ఇచ్చింది. ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్ సెక్యూరిటీ (ఐసీపీ) విభాగాలు ఈ కథనాలు పూర్తిగా ఫేక్ అని కొట్టిపారేశాయి.లక్ష అరబ్ ఎమిరేట్స్ దినార్లు (సుమారు రూ.23.3 లక్షలు) ఫీజు చెల్లిస్తే జీవితకాలం వర్తించే వీసా అందజేస్తున్నట్లు రాయద్ గ్రూప్ తెలిపింది. దాంతో చాలా అంతర్జాతీయ వార్తా సంస్థలు ఈమేరకు కథనాలు ప్రచురించాయి. ఇవికాస్తా వైరల్‌గా మారడంతో దుబాయ్ ప్రభుత్వమే రంగంలోకి దిగి స్పష్టతనిచ్చింది. ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్ సెక్యూరిటీ (ఐసీపీ) విభాగాలు ఇలా వస్తున్న కథనాలను నమ్మకూడదని తేల్చి చెప్పాయి.UAE denies lifetime Golden Visa eligibility for Indians, Bangladeshis; dismisses ₹23 lakh reporthttps://t.co/FcxxTHOnpx— Hindustan Times (@htTweets) July 9, 2025ఇదీ చదవండి: యాపిల్ కొత్త సీఓఓ మనోడే..‘అన్ని గోల్డెన్ వీసా అప్లికేషన్లు అధికారిక యూఏఐ ప్రభుత్వ మార్గాలు, స్పష్టమైన విధానాల ద్వారానే ప్రాసెస్ అవ్వాలి. దరఖాస్తుదారులను నమ్మించేలా, వారి అప్లికేషన్లను ప్రాసెస్ చేయడానికి లేదా నామినేట్ చేయడానికి ఏ బాహ్య కన్సల్టెన్సీకి లేదా ఏజెన్సీకి అధికారం లేదు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ, ప్రజల ఆకాంక్షలను దుర్వినియోగం చేసే సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని తెలిపింది. ఖచ్చితమైన వివరాల కోసం దరఖాస్తుదారులు ఐసీపీ అధికారిక వెబ్సైట్ లేదా 600 522 222 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని కోరింది. -
అక్కడ.. ఈ దుస్తులు ధరించకండి
పాశ్చాత్య దేశాలకు వెళ్లినపుడు సంప్రదాయ అరబ్ దుస్తులను ధరించవద్దని యూఏఈ తమ దేశ పౌరులకు సూచించింది. విదేశాలకు ప్రయాణించినపుడు, ముఖ్యంగా విదేశాల్లో బహిరంగ ప్రదేశాలకు వెళ్లినపుడు సంప్రదాయ దుస్తులు ధరించవద్దని యూఏఈ విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో హెచ్చరించింది. యూఏఈ పౌరుల భద్రత దృష్ట్యా ఈ జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. అమెరికాకు వెళ్లిన ఎమిరేట్స్ వ్యాపారవేత్తను జిహాదిగా భావించి యూఎస్ పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో యూఏఈ హెచ్చరికలు జారీ చేసింది. అమెరికాకు వైద్య చికిత్స కోసం వెళ్లిన యూఏఈ వ్యాపారవేత్త అహ్మద్ అల్ మెన్హలి (41) క్లీవ్‌లాండ్‌లోని ఓ హోటల్లో బసచేశారు. తెల్లటి అరబ్ దుస్తుల్లో ఉన్న ఆయనను హోటల్ సిబ్బంది జిహాదిగా అనుమానించారు. అంతేగాక ఐఎస్ ఉగ్రవాదులతో ఫోన్లో మాట్లాడుతున్నారని సందేహించారు. హోటల్ సిబ్బంది ఫిర్యాదు చేయగా పోలీసులు వచ్చి ఆయనను అరెస్ట్ చేశారు. సాయుధులైన పోలీసులు అహ్మద్ అల్ మెన్హలిని అదుపులోకి తీసుకుని కొట్టారు. దుస్తులు విప్పించి తనిఖీ చేశారు. అహ్మద్ అల్ మెన్హలికి ఐసిస్‌తో సంబంధాలు లేవని నిర్ధారించుకున్న తర్వాత పోలీసులు ఆయనను వదలిపెట్టారు. పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని, తాను తీవ్రంగా గాయపడ్డానని అహ్మద్ అల్ మెన్హలి చెప్పారు.