భారత్‌, యూఏఈ దోస్తీ జిందాబాద్‌: ప్రధాని మోదీ

Prime Minister Modi Will Inaugurate Baps Hindu Temple In Abu Dhabi - Sakshi

అబుధాబి: యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో నిర్మించిన అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. దాదాపు 27 ఎకరాల విస్తీర్ణంలో హిందూ ధర్మం ఉట్టిపడేలా బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ ఈ ఆలయాన్ని నిర్మించింది. ఫిబ్రవరి 14న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆలయంలో దేవతా విగ్రహాల ప్రతిష్టాపన చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడారు. అక్కడ ఉన్న భారతీయులను ఉత్సాహపరచడానికి మోదీ... తెలుగు, మళయాళం, తమిళం భాషల్లో మాట్లాడారు. భారత్‌, యూఏఈ మధ్య ఇవాళ కీలక ఒప్పందాలు కుదిరాయి. అబుదాబిలో ఆలయాన్ని నిర్మిస్తామని అడిగిన వెంటనే యూఏఈ అధ్యక్షుడు ఒప్పుకున్నారు. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఆలయం కోసం స్థలం ఇస్తామన్నారు. యూఏఈ అభివృద్ధిలో భారతీయులు కీలకపాత్ర పోషించారు. భారత్‌, యూఏఈ దోస్తీ జిందాబాద్‌ అని మోదీ అన్నారు. 

యూఏఈ అత్యున్నత పౌరపురస్కారం నాకు లభించిందంటే.. అది మీ వల్లే అని అక్కడి భారతీయ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇక్కడ ఉ‍న్న భారతీయులను చూసి దేశం గర్విస్తోందని తెలిపారు. 30 ఏళ్ల తర్వాత యూఏఈలో పర్యటించిన తొలి భారత ప్రధానిని నేనే యూఏఈ అధ్యక్షుడు గుజరాత్‌ వచ్చినప్పుడు ఆయనను గౌరవించామని తెలిపారు. తన మూడో టర్మ్‌లో భారత్‌ను మూడో అతిపెద్ద అర్థిక వ్యవస్థగా మారుస్తా అని స్పష్టం చేశారు. భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతోందని.. కొత్త ఎయిర్‌పోర్టులు, ఎక్స్‌ప్రెస్‌వేలు, ఆధునిక రైల్వే స్టేషన్లు నిర్మిస్తున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

whatsapp channel

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top