
16న జగిత్యాల, 17న నిజామాబాద్‌లలో ఇంటర్వ్యూలు
మోర్తాడ్ (బాల్కొండ): యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) పరిధిలోని ఆబుదాబిలో ఉపాధి కల్పనకు ఉచిత వీసాల జారీకి ఏడీఎన్‌హెచ్, జీటీఎం సంస్థలు మరోసారి నియామకాల మేళా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఈనెల 16న జగిత్యాలలో, 17న నిజామాబాద్‌లలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు.
క్లీనింగ్ విభాగంలో పని కల్పించడానికి ఇంటర్వ్యూలను నిర్వహించనుండగా.. 21 ఏళ్లు నిండి, 38 ఏళ్లలోపు వయసున్న వారు ఈసీఎన్‌ఆర్ పాస్‌పోర్టు కలిగి ఉంటే నియామకాల మేళాకు హాజరు కావచ్చు. ఎంపికైన వారికి మన కరెన్సీలో రూ.22 వేల వేతనం ప్రతి నెలా చెల్లించనున్నారు. ఉచిత వసతి, ఉచిత భోజన సదుపాయాన్ని కల్పించనున్నారు.
వివరాలకు ఆర్మూర్ (8332062299), సిరిసిల్ల (9347661522), నిజామాబాద్ (8686860999), జగిత్యాల్ (8332042299)ల్లోని జీటీఎం సంస్థ శాఖలను సంప్రదించాలని సంస్థ చైర్మన్ చీటీ సతీశ్‌రావు వెల్లడించారు. ఉచిత వీసాలతో పాటు ఉచిత టికెట్ల కోసం నిర్వహిస్తున్న ఈ నియామకాల మేళాను నిరుద్యోగ యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఎవరికి నయాపైసా చెల్లించాల్సిన అవసరం లేదని సతీశ్‌రావు స్పష్టం చేశారు.